NTV Telugu Site icon

Pushpa 2: వైల్డ్ ఫైర్ జాతరకి 1000 మంది పోలీసులు!

Pushpa 2new

Pushpa 2new

హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర ఈవెంట్ జరిపేందుకు యూనిట్స సిద్ధమైంది. ఇప్పటికే వేదిక వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈవెంట్ కోసం పోలీసు శాఖ సుమారు 1000 మంది పోలీసులను అక్కడ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వివిధ విభాగాలకు చెందిన వెయ్యి మంది పోలీసులు ఈవెంట్ కోసం పనిచేస్తున్నారు. అంతే కాదు ఈవెంట్ నిర్వాహకులు సైతం ప్రైవేటు బౌన్సర్లను రంగంలోకి దించారు. నిజానికి కొద్ది రోజుల క్రితం జరగాల్సిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సరైన ప్లానింగ్ లేకపోవడంతో ఫెయిల్ అయింది.

ఆ ఈవెంట్ నిర్వహించలేకపోయారు. ఇప్పుడు ఈవెంట్ నిర్వహిస్తున్న ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థని ఆరోజు కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ చేసింది. ఆ రోజు జరిగిన అనుభవాల దృష్ట్యా ఈసారి చాలా పగడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న యూసఫ్ గూడ పరేడ్ గ్రౌండ్స్ వైపు ఎలాంటి వాహనాలు కూడా వెళ్లకుండా రోడ్డు డైవర్షన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఈవెంట్ ని పుష్ప టీం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Show comments