NTV Telugu Site icon

100 Crores: నిర్మాతగా మారిన మ్యూజిక్ డైరెక్టర్.. ఏకంగా ‘100 క్రోర్స్’

111

111

ఈ మధ్య డెరైక్టర్లు చాలా మంది నిర్మాతలు అవుతున్నారు. అయితే ఈసారి భిన్నంగా మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు నిర్మాత అవుతున్నారు. యధార్థ సంఘటనల ఆధారంగా తీసే చిత్రాల్లో ఓ సహజత్వం ఉంటుంది. అలా 2016లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్‌లను బేస్ చేసుకుని, వినోదభరితంగా ‘100 క్రోర్స్’ అనే సినిమాను నిర్మించారు. సాయి కార్తీక్, దివిజా కార్తీక్, ఎస్.ఎస్.స్టూడియోస్ బ్యానర్ మీద నిర్మించారు. విరాట్ చక్రవర్తి కథ అందించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాహుల్, చేతన్, యమీ, సాక్షి చౌదరి, లహరి, అన్నపూర్ణమ్మ, ఐశ్వర్య, భద్రం, ఇంటూరి వాసు, సమీర్ వంటి వారు కీలక పాత్రలను పోషించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

సోమవారం నాడు ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్‌లో దర్శకులు వీర శంకర్, మల్లిక్ రామ్, నిర్మాత హర్షిత్ రెడ్డి, నిర్మాత దామోదర ప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇక 100 క్రోర్స్ అనే టైటిల్‌తోనే సినిమాపై అందరిలోనూ ఆసక్తిని పెంచేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా చాలా కొత్తగా ఉంది. ఇక ఈ సినిమాకి చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా వ్యవహరించారు. సాయి కార్తీక్ సంగీతాన్ని అందించగా ఎస్.బీ.ఉద్దవ్ ఎడిటర్‌గా, వింగ్ చున్ అంజి ఫైట్ మాస్టర్‌గా పని చేశారు. ఇక ఫైనాన్షియల్ ఇష్యూ చుట్టూ తిరిగే కథగా ఈ సినిమా ఉంటుందని అర్థం అవుతోంది. మరి రిలీజ్ అయితే కానీ ఈ 100 కోట్ల కథా కమామీషు ఏమిటి అనేది తెలియదు అనే చెప్పాలి.

Show comments