Site icon NTV Telugu

Wamiqa : ప్లాప్ భామ చేతిలో ఏకంగా 10 సినిమాలు

Wamika

Wamika

వామికా గబ్బీ బాలీవుడ్ రీసెంట్ సెన్సేషన్. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ బేబీ జాన్ ఆమెను పాపులర్ బ్యూటీ మార్చేసింది. పోనీ ఈ సినిమా ఆడిందా అంటే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కానీ ఈ రిజల్ట్ ఆమె కెరీర్‌పై ఎటువంటి ఎఫ్టెక్ట్ చూపలేదు సరికదా బూస్టర్ అయ్యింది. ప్లాప్ సినిమాతో కూడా క్రేజీ ఆఫర్స్ కొల్లగొట్టవచ్చునని నిరూపిస్తోంది ఈ బ్యూటీ.

Also Read : Tollywood : టాలీవుడ్‌కు దూరం జరుగుతోన్న స్టార్ బ్యూటీలు

వామికా లైనప్స్ చూస్తే వామ్మో అనాల్సిందే. ఒక్కో ప్రాజెక్టులను మెల్లిగా తన బ్యాగ్ లో వేసుకుంటుంది. ఒకటి కాదు ఐదు ఇండస్ట్రీలను మడతపెట్టేస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో క్రేజీ చిత్రాల్లో నటించే ఆఫర్స్ కొల్లగొడుతుంది. ప్రజెంట్ హిందీలో రాజ్ కుమార్ రావ్ హీరోగా వస్తోన్న భూల్ చుక్ మాఫ్‌లో నటిస్తోంది అమ్మడు. ఏప్రిల్ 10న థియేటర్లలోకి రాబోతుంది. ఇదే కాదు దిల్ కా దర్వాజా కోల్ నా డార్లింగ్, అక్షయ్ కుమార్ భూత్ బంగ్లాతో పాటు రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తోన్న ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ రక్త బ్రహ్మాండ్‌లో కీ రోల్ ప్లేచేస్తోంది ఈ బ్యూటీ. బాలీవుడ్‌లోనే కాదు అటు పంజాబీతో పాటు ఇటు సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తోంది వామికా గబ్బీ. తెలుగులో పదేళ్ల తర్వాత అడివిశేష్ క్రేజీయెస్ట్ మూవీ గూఢచారీ2లో కమిటైంది ఈ నయా సెన్సేషన్. అలాగే తమిళంలో జీని అనే భారీ బడ్జెట్ చిత్రంలోనూ యాక్ట్ చేయబోతుంది. మలయాళంలో టికీ టాకాతో పాటు రణబీర్ అప్ కమింగ్ ప్రాజెక్టులో కూడా వామిక పేరు వినిపిస్తోంది. ప్లాప్స్ కొడుతుంటేనే ఇలా ఉంటె ఇలా హిట్స్ వస్తే పరిస్థితి ఏంటో.

Exit mobile version