యంగ్ హీరో నితిన్ మరోసారి ‘ఛల్ మోహన రంగ’ ఫేమ్ కృష్ణ చైతన్య డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే నితిన్ మిగతా సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమా ముందుకు వెళ్ళలేదు. దీంతో చాలా రోజుల నుంచి ఈ సినిమాపై ఎలాంటి అప్డేట్ లేదు. అయితే నితిన్ కు వ్యక్తిగతంగా ఈ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది. ఈ చిత్ర కథ మరో సినిమా కథతో పోలివుండటమే కారణంగా తెలుస్తోంది. అయితే తాజాగా పవర్‌పేట సినిమా చేయడానికి రేసులో యంగ్ హీరో శర్వానంద్ పేరు వినిపిస్తోంది. ఆయన్ను ఒప్పించేందుకు చిత్రయూనిట్ ప్రయత్నాలు చేస్తుందట. ప్రస్తుతం శర్వా ‘మహా సముద్రం’ ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమాలో నటిస్తున్నాడు.