NTV Telugu Site icon

సినిమా కోసం ‘గుర్తుపట్టలేనంత’గా మారిపోయిన ‘బిచ్చగాడు’ స్టార్ విజయ్ ఆంథోని!

తమ సినిమాల్లో రకరకాల వేషాలు వేయటం, గుర్తుపట్టలేని విధంగా మేకప్ అండ్ లుక్ తో సర్ ప్రైజ్ చేయటం కోలీవుడ్ లో కొందరు హీరోలకి మామూలే! కమల్ హసన్ మొదలు విక్రమ్ దాకా రకరకాల ప్రయోగాలు చేసిన వారే. ఇప్పుడు నటుడు విజయ్ ఆంథోని అదే బాటలో వెళుతున్నాడు. ఆయన అప్ కమింగ్ మూవీ ‘అగ్ని సిరగుగల్’. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న సినిమాలో విజయ్ ఆంథోని గడ్డంతో కనిపిస్తాడట. అసలు ప్రేక్షకులు ఆయన్ని గుర్తుపట్టలేరని డైరెక్టర్ నమ్మకంగా చెబుతున్నాడు.
‘అగ్ని సిరగుగల్’ దర్శకుడు నవీన్ మహ్మద్ ఆలీ. ఆయన చేసిన ఓ ట్వీట్ కు స్పందిస్తూ విజయ్ ఆంథోని సినిమా త్వరగా జనం ముందుకు రావాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. మంచి సబ్జెక్ట్ ఎప్పుడూ జనాలకి నచ్చుతుందని ట్వీట్ లో అన్నాడు. అయితే, విజయ్ ఆంథోనీ విశ్వాసానికి కారణం మూవీలోని కథ, కథనాలే! ఇప్పటికే ‘అగ్ని సిరగుగల్’ సినిమా చెన్నై, కోల్ కతా, మాస్కో లాంటి నగరాల్లో జరిగింది. కజకిస్తాన్ లోనూ మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలతో కొంత యాక్షన్ పార్ట్ చిత్రీకరించారు. ఇంకా కొంత భాగం షూటింగ్ పార్ట్ మిగిలి ఉందట. చూడాలి మరి, విజయ్ ఆంథోనీ, అరుణ్ విజయ్, ప్రకాశ్ రాజ్, రైమా సేన్, అక్షరా హసన్ కీలక పాత్రలు పోషిస్తోన్న థ్రిల్లర్ నటీనటుల కష్టానికి తగ్గ ఫలితం ఇస్తుందో లేదో!