Site icon NTV Telugu

యూట్యూబ్ లో ‘అఖండ’ హవా… రికార్డ్స్ సెట్ చేస్తున్న బాలయ్య

Akhanda Roar continues with 15 Million views

నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఉగాది కానుకగా విడుదలైన టైటిల్ రోర్ ‘అఖండ’కు ప్రేక్షకుల నుంచి అఖండమైన ఆదరణ లభిస్తోంది. ‘అఖండ’ టైటిల్, టీజర్ లో బాలకృష్ణ గెటప్, ఆయన డైలాగ్స్, థమన్ సమకూర్చిన నేపథ్య సంగీతం ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏప్రిల్ 13న విడుదలైన టైటిల్ రోర్ ‘అఖండ’ 15 మిలియన్ల వ్యూస్ ను దాటేసి రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అంతేకాదు 300కే లైక్స్ రాగా… ఇంకా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుండడం విశేషం. ఈ సినిమా నుంచి విడుదల చేసిన హీరో పరిచయ టీజర్ కే ఇంత భారీ రెస్పాన్స్ వచ్చిందంటే… ఇక సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ‘అఖండ’లో ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్. పూర్ణ, జగపతి బాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న ఈ మూవీపై అభిమానుల‌లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

Exit mobile version