కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. తాజాగా తమిళ నటుడు నితీశ్ వీరా కరోనాకు బలయ్యారు. ధనుష్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అసురన్’లో పాండ్యన్ పాత్రపోషించి గుర్తింపు తెచ్చుకున్న నితీశ్ చెన్నైలోని ఒమందురార్ హాస్పిటల్ లో ఈ రోజు కన్నుమూశారు. ‘పుదుపేట్టై, వెన్నెల కబాడి కుళు, మావీరన్ కిట్టు’ సినిమాల్లో నూ గుర్తింపు ఉన్న పాత్రలను పోషించారు నితీశ్. ఇక రజనీకాంత్ ‘కాలా’లోనూ కనిపించిన నితీశ్ మరణం తమిళ చిత్రపరిశ్రమలో పెద్ద షాక్ అనే చెప్పాలి. నితీశ్ వయసు 45 సంవత్సరాలు.
కరోనాతో తమిళ నటుడు నితీశ్ వీరా మృతి
