NTV Telugu Site icon

Cinema Chettu: సినిమా చెట్టుకు కొత్త చిగురు

Cinema Chettu

Cinema Chettu

గోదారి గట్టుంది, గట్టు మీద సినిమా చెట్టు ఉంది.. అయితే ఆ చెట్టు కూలిపోయింది. ఇంతవరకు మీకు తెలుసు.. కానీ ఇప్పుడు ఆ చెట్టు మళ్ళీ చిగురిస్తోంది. అవును ఆశ్చర్యం అనిపించినా అది నిజమే అండోయ్. దాదాపు 150 ఏళ్ల క్రితం నాటి ఈ భారీ వృక్షం ఇప్పటి వరకు సుమారు 300లకు పైగా సినిమాల్లో కనిపించిన ఈ నిద్ర గన్నేరు మహా వృక్షానికి పునర్ జన్మ ఇచ్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. రెండు వైపులా ఉన్న కొమ్మల బరువుతో, వేర్ల దగ్గర గోదారి కోతతో ఈ చెట్టు రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే. చెట్టు వేళ్లతో సహా కూలిపోతే దానికి మళ్లీ పునరుజ్జీవనం పోవయడం కష్టం కానీ ఆ చెట్టు కూలిపోయినా వేర్లు ఇంకా భూమిలో బ్రతికే ఉన్నాయి కాబట్టి అది మళ్లీ చిగిర్చే అవ‌కాశం ఉందని ఆ మేరకు ప్రయత్నాలు చేశారు.

Also Read: Subrahmanyaa: సాయి కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. డైరెక్టర్ ఎవరంటే?

దాన్ని నిలబెడితే ఓ చరిత్ర నిలబడుతుందని ప్రకృతి ప్రేమికులు, గ్రామస్తులు చేసిన ప్రయత్నాల వల్ల ఇప్పుడు చిగురు మళ్ళీ మొలకెత్తింది. కొన్నాళ్ల క్రితం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ చెట్టుకు కొన్ని రసాయనాలతో ట్రీట్మెంట్ చేశారు. 50 రోజుల్లో చెట్టుకి చిగుర్లు వస్తాయని భావించగా అవి నెల రోజుల్లోనే రావడంతో గ్రామస్తులు, ప్రకృతి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ చెట్టు కుమారదేవం గ్రామస్తులకు మూడుపూటల భోజనం పెట్టిందని అంటూ ఉంటారు. ఈ చెట్టు దగ్గర సినిమా షూటింగ్‌లు జరిగితే కుమారదేవం గ్రామస్తులకు ఉపాధి దొరికేదని స్థానికులు చెబుతున్నారు. ఈ చెట్టు కూలిపోవడంతో ఇంట్లో మనిషిని కోల్పోయినంత బాధగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితుల్లో కూలిపోయిన చెట్టుకు మళ్లీ పూర్వవైభవం రావాలని కోరుకుంటూ స్థానికులు పూజాలు చేయడంతో అన్నీ ఫలించి మళ్ళీ చిగురించింది.