Cinema Bandi Productions ‘Tantiram’ First Look unveild: ఈ మధ్య కాలంలో చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా అయినా చూసేసి బ్రహ్మరథం పట్టేస్తున్నారు మన ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ఎందరో తాము కూడా ప్రేక్షకులకు తమ కథలు చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో రూపొందిన సినిమానే తంతిరం. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయింది. శ్రీకాంత్ గుర్రం హీరోగా ప్రియాంక శర్మ హీరోయిన్ గా “తంతిరం” సినిమాను ముత్యాల మెహర్ దీపక్ డైరెక్ట్ చేశారు. కాండ్రేగుల లావణ్య రాణి సమర్పణలో సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్ పై తంతిరం సినిమాను శ్రీకాంత్ కాండ్రేగుల నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది. ఇక సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టిన సినిమా యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
Skanda: బోయపాటి- రామ్ పోతినేని ‘స్కంద’ గుమ్మడికాయ కొట్టేశారు
ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్ కాండ్రేగుల మాట్లాడుతూ మా తంతిరం సినిమా చాలా కొత్తగా ఉంటుందని అన్నారు. ఈ తంతిరం హారర్ అంశాలతో కూడిన కుటుంబ కధా చిత్రమని, భార్య భర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుందో అదే మా తంతిరం సినిమా అని అన్నారు. తంతిరం సినిమా షూటింగ్ కేరళ ప్రాంతాల్లో అందమైన లొకేషన్స్ లో చేశామని షూటింగ్ అంతా పూర్తి అయి ప్రస్తుతానికి నిర్మాణాంతర పనుల్లో బిజీగా ఉందని అన్నారు. ఈ రోజు మా సినిమా యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశామన్న ఆయన త్వరలోనే టీజర్, ట్రైలర్ తో మీ ముందుకు వస్తాం అని వెల్లడించారు. ఈ సినిమాకి వంశీ శ్రీనివాస్ కెమెరా మాన్ అలాగే ఎడిటర్ గా వ్యవహరిస్తుండగా అజయ్ ఆరాసాడా సంగీతం అందించారు. భాస్కరభట్ల లిరిక్స్ అందించిన ఈ సినిమా రిలీజ్ కి సిద్దం అవుతోంది.
