Cine1 Studios Moves Delhi High Court Seeking Stay On Animal OTT Release: రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో తెరకెక్కిన యానిమల్ మూవీ ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా చూసిన చాలా రోజుల వరకు ఈ సినిమా గురించే ఆడియన్స్ అందరూ మాట్లాడుకున్నారంటే ఎంత ట్రాన్స్ లోకి తీసుకెళ్లి పోయింది అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమా ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఇక మరికొద్ది రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా చూసేద్దాం అనుకుని ఎదురుచూస్తున్న సినీ అభిమానులందరికీ షాక్ తగిలింది. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ చేయకుండా స్టే విధించాలి అంటూ సినీ వన్ స్టూడియోస్ అనే సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
Guntur Kaaram: ‘హిట్ జోష్’లో మహేష్.. టీమ్ మొత్తానికి సొంతింట్లో పార్టీ
అసలు విషయం ఏమిటంటే సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్(టీ సిరీస్) మీద సినీ వన్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ఒక కేసు ఫైల్ చేసింది. దాని ప్రకారం ముందుగా అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈ రెండు సంస్థలు కలిపి యానిమల్ మూవీ నిర్మించాయి. ఈ నేపథ్యంలో యానిమల్ మూవీకి సంబంధించిన 35% ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ 35% లాభాల్లో షేర్ సినీ వన్ స్టూడియో సంస్థకు దక్కాల్సి ఉంది. కానీ ఈ లాభాల షేరింగ్ విషయంలో ఈ అగ్రిమెంట్ ని టి సిరీస్ సంస్థ పూర్తిగా పక్కన పెట్టేసిందని, సినిమాని ప్రమోట్ చేస్తున్న సమయంలో ఎలాంటి వివరాలు అందించలేదని సదరు సంస్థ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. ఇక ఈ సంస్థ పిటిషన్ ఫైల్ చేసిన నేపథ్యంలో ఓటిటి రిలీజ్ మీద స్టే విధించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది తెలియాల్సి ఉంది.