సినీ కార్మికుల సమ్మె 16వ రోజుకు చేరుకుంది. కార్మిక సంఘాల పెంపుపై అటు ఫెడరేషన్ నాయకులకు ఇటు నిర్మాతలకు మధ్య ఇటీవల జరిగిన చర్చలు ఫలించలేదు. దాంతో సమ్మె కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఈ చర్చలు త్వరగా ముంగిచాలని భావిస్తున్నారు నిర్మాతలు. ఈ నేపధ్యంలో ఈ రోజు ఉదయం 10గంటలకు ఇందిరా నగర్ లో సినీ కార్మిక సంఘాల సర్వసభ్య సమావేశం కాబోతున్నారు. సర్వసభ్య సమావేశం అనతరం సమస్యలు పరిష్కరించబడాలని సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేయనున్నారు సినీ కార్మికులు.
Also Read : Rahul Sipligunj : టీడీపీ నేత కూతురిని పెళ్లాడబోతున్న సింగర్ రాహల్ సిప్లిగంజ్
అలాగే నేడు మరోసారి చిరంజీవిని కలువనున్న ఫెడరేషన్ నాయకులు. తమ వాదనలు మరోసారి ఆయనకు వినిపించి న్యాయం చేయాలనీ కోరబోతున్నారు. అటు నిర్మాతలు కూడా నేడు మరోసారి చిరుతో భేటీ కాబోతున్నారు. అనంతరం సాయంత్రం ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ నాయకుల సమావేశం కాబోతున్నారు. 16 వ రోజు సమ్మె తో టాలీవుడ్ స్తంభించింది. షూటింగ్స్ లేక సగటు కార్మికులు విలవిలలాడుతున్నారు. రోజువారి వేతనాలు లేక ఇబ్బంది పడుతున్నారు. నిర్మాతలు పెట్టిన మొత్తం నాలుగు కండిషన్స్ లో రెండు కండిషన్స్ కు ఫెడరేషన్ నాయకులు అంగీకారం తెలపగా మరో రెండు కండిషన్స్ పై ఫెడరేషన్ నాయకులు అభ్యంతరం తెలిపారు. ఆ రెండిటిపైనే సుదీర్ఘ చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజు జరిగే ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ చర్చలతో సమ్మె సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశంఉందని ఇరువురు భావిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్స్ బంద్ కారణంగా భారీ బడ్జెట్ సినిమాలు ఇబ్బందిపడుతున్నాయి. కాంబినేషన్ డేట్స్ సెట్ అవడం అంత సులువు కాదు, ఈ చర్చలు త్వరగా ముగించాలని కోరుతున్నారు.
