Site icon NTV Telugu

Tollywood : ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం.. ఫెడరేషన్ వార్నింగ్..

Tollywood Strike,

Tollywood Strike,

Tollywood : సినీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 8వ రోజు అన్నపూర్ణ 7 ఎకర్స్‌ దగ్గర ఉన్న యూనియన్ ఆఫీసుల నుంచి ఫెడరేషన్ ఆఫీస్ వరకు ర్యాలీ చేసి తమ గళం వినిపించారు. అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. కొందరికి పెంచి మిగతా వారికి పెంచకపోవడం అన్యాయం అన్నారు. అన్ని యూనియన్ల వారికి పెంచాల్సిందే అని డిమాండ్ చేశారు. మొదటి ఏడాది 20 శాతం పెంచి రెండో ఏడాది 10 శాతం పెంచాలని కోరుతున్నట్టు తెలిపారు. దానికి ఛాంబర్ ఒప్పుకోవట్లేదని.. వాళ్ల కండీషన్లకు తాము తలొగ్గేది లేదని స్పష్టం చేశారు.

Read Also : Mega Heros : ముగ్గురు మెగా హీరోలు ఒకే ఫ్రేమ్ లో..!

నిర్మాత విశ్వ ప్రసాద్ మాకు లీగల్ నోటీసులు ఎందుకు పంపారో అర్థం కావట్లేదు. ఆయనకు ఏదైనా సమస్య ఉంటే ఛాంబర్ తో మాట్లాడుకోవాలి. పీపుల్స్ మీడియా మాకు రూ.90లక్షల బాకీ ఉంది. ఆయన మాకు క్షమాపణ చెప్పాలి. మేం ఎవరికీ తలొగ్గేది లేదు. మమ్మల్ని విడదీయడానికి ప్రయత్నించొద్దు. బయటి వారిని తెచ్చుకుంటామని నిర్మాతలు చెబుతున్నారు. మేం బయటి వారిని రానివ్వం. అవసరం అయితే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం అంటూ తేల్చిచెప్పారు ఫెడరేషన్ సభ్యులు. సోమవారం మరోసారి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యుల మధ్య చర్చలు జరగనున్నాయి. అందులో ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Read Also : Vadde Naveen : వడ్డే నవీన్ రీ ఎంట్రీ.. ఫస్ట్ లుక్ రిలీజ్..

Exit mobile version