NTV Telugu Site icon

Chota K Naidu: పవన్ బట్టల నిండా రక్తం.. అతనిని చేతుల్లో మోసుకుంటూ పరిగెత్తాడు

Pawan Kalyan

Pawan Kalyan

Chota K Naidu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలు.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఏపీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రచారాల కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. మొదటినుంచి కూడా పవన్ లో ఎదుటి మనిషికి సాయం చేసే గుణం ఉంది. తప్పు జరిగితే నిలదీసే తత్త్వం ఉంది. ఇది తన తండ్రి దగ్గరనుంచి వచ్చిందని పవన్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. అయితే రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి.. ఇలాంటి మాటలు చెప్తున్నాడు అని విమర్శలు వస్తున్నాయి. కానీ, తాను రాజకీయాల్లోకి రాకముందే.. అసలు స్టార్ గా అవ్వకముందే ఎదుటివారికి సాయం చేసే గుణం ఉందని సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఇంటర్వ్యూ పాతదే అయినా.. పవన్ మంచి మనసు ఎలాంటిదో చూడండి అంటూ పవన్ అభిమానులు మరోసారి ఈ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు.

అసలు పవన్ గురించి చోటా ఏమన్నాడు అంటే.. ” తొలిప్రేమ సినిమా సమయంలో అనుకుంటా.. ఒక క్రికెట్ సీన్ చేస్తున్నాం. గచ్చిబౌలిలోని నానక్ రామగూడా లో.. అప్పుడు అక్కడ ఒక పెద్ద క్వారీ ఉండేది. ఆ రోజు పవన్ కళ్యాణ్ రవిబాబుతో క్రికెట్ ఆడుతూ ఒక ఫైట్ ఉంటుంది. ఆ షాట్ తీస్తున్నాం. రవిబాబు, పవన్ కళ్యాణ్ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ఉన్నారు. క‌ళ్యాణ్ గారు అప్పుడే కొత్తగా వస్తున్న ఓ సుమోలో సెట్స్ కి వ‌చ్చారు. నేను ఆయ‌న కోసం బ‌య‌ట ఎదురు చూస్తున్నా. నన్ను చూసి ఏంటి ఇక్క‌డున్నార‌న్నారు అని అడిగారు. నేను మీకోసమే అని చెప్పాను. సరే పదండి వెళ్దాం అని అంద‌రం క‌లిసి వెళ్తున్నాం.. ఇంత‌లో ఓ వ్య‌క్తి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని చూస్తూ స్కూట‌ర్ డ్రైవ్ చేస్తున్నాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెనుక‌గా ఉండ‌టంతో వెన‌క్కి తిరిగి మ‌రీ చూసాడు. అంతలోనే అత‌డిని ఒక కారు వచ్చి గుద్దేసింది. స్టార్లు .. అప్పుడప్పుడే షూటింగ్ అన్నట్లు చూసాడు అతను.. అంతలోనే కారు వాడు గుద్దేసాడు. ఆ వ్యక్తి ఎగిరి దమ్మని పడ్డాడు. అరే పడ్డారు అని నేను అక్కడే ఉన్నాను. కానీ, పవన్ పరిగెత్తుకెళ్లి.. పడిన అతన్ని చేతులతో మోసుకుంటూ.. తన సుమోలో ఎక్కించి హాస్పిటల్ కు పంపించాడు. ఆ వైట్ అండ్ వైట్ డ్రెస్ మొత్తం రక్తంతో తడిసిపోయింది. షూటింగ్ లేదు.. ఏమి లేదు.. అస్సలు ఆయనకు షూటింగ్ అన్న విషయం కూడా గుర్తులేదు. అది ప‌వ‌న్ క‌ళ్యాణ్ గొప్ప‌త‌నం. స‌హాయం అంటే ఆయ‌న ఎంతో చ‌లించిపోతాడు. ముక్కు..ముఖం తెలియ‌క‌పోయినా అయ్యో అత‌డు ఏ క‌ష్టంలో ఉన్నాడ‌ని అలోచిస్తూనే ఉంటాడు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఓల్డ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.