Chota K Naidu: మోహన్‌బాబు పేరు విని వెనకడుగు వేశా.. విష్ణు ఇంకోసారి ఆ పని చేయకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chota K Naidu Comments Mohan Babu Chota K Naidu: మంచు విష్ణు, సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘జిన్నా’ సినిమా ఈనెల 21న విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో సినిమాటోగ్రఫర్ ఛోటా కే నాయుడు మాట్లాడుతూ.. ‘‘నేను మంచు కాంపౌండ్‌లో చేసిన తొలి సినిమా ఇది. తొలుత ఈ కథ తనకు కోన వెంకట్ వినిపించినప్పుడు నాకు బాగా నచ్చింది. సెకండాఫ్ అయితే మరింత అద్భుతంగా ఉంది. దీంతో ఈ సినిమా చేద్దామని అన్నాను. హీరో మంచు విష్ణు అనగానే, ఓకే అన్నాను. కానీ.. ఈ సినిమాకి మోహన్‌బాబు నిర్మాత అన్నప్పుడు వెంటనే కారు ఆపేయమని అన్నాను. ఈ సినిమా చేయనని చెప్పాను. ఎందుకని కోన వెంకట్ ప్రశ్నిస్తే.. మోహన్‌బాబుకు నేనంటే నచ్చదు, ఆయనకు నేనంటే కోపం, అగ్నిపర్వతాలు బద్దలైపోతాయని చెప్పాను. అప్పుడు నాకు నచ్చజెప్పి, మోహన్‌బాబు ఆఫీస్‌కి తీసుకెళ్లారు’’ అని చెప్పాడు.
‘‘ఆఫీస్‌కి వెళ్లగానే ఆయన స్వాగతించిన విధానం చూసి ఒక్కసారిగా షాకయ్యా. బహుశా ఆయన గురించి నేను అనుకున్న పర్సెప్షన్ తప్పు అయ్యుంటుందని ఆ క్షణం అనిపించింది. అంతేకాదు.. ఈ సినిమా విషయంలో ఆయన నాకెంతో స్వేచ్ఛనిచ్చారు. నన్ను మరో కొడుకుగా చూసుకున్నారు’’ అని మోహన్‌బాబు గురించి ఛోటా కే నాయుడు చెప్పుకొచ్చాడు. అనంతరం మంచు విష్ణు గురించి మాట్లాడుతూ.. ‘‘షూటింగ్లో విష్ణు నస పెడతాడేమోనని అనుకున్నాను. కానీ, ఏ విషయంలోనూ అతడు జోక్యం చేసుకోలేదు. నేను అనుకున్న విష్ణు వేరు.. నేను చూసిన విష్ణు వేరు. సినిమా కోసం అతడు ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. అతని కాలుకి అయిన గాయమే అందుకు నిదర్శనం. ఒక సీన్లో రింగులు తిరుగుతూ జంప్ చేయాల్సి వస్తుంది. దాని వల్ల కాలుకి గాయం అయ్యింది. రిస్క్ చేయాలి కానీ, మరి ఎక్కువ రిస్క్ చేయకూడదు. కాబట్టి, మరీ గాయాలయ్యేంత రిస్కులు చేయొద్దని విష్ణుకి సూచిస్తున్నాను’’ అంటూ పేర్కొన్నాడు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని తనకు నమ్మకం ఉందని, ఇది మోహన్‌బాబుకి ఇచ్చే గిఫ్ట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. ఈ సినిమా డైరెక్టర్ సూర్యలో తనకు ఒక క్రాంతి, ఒక జంధ్యాల కనిపించారని అన్నాడు. కోన తనను మోహన్‌బాబు దగ్గర ఇరికించాడని తాను అనుకున్నానని, కానీ కోన వల్ల తనకు మరో ఆస్తి దొరికినట్టు అయ్యిందని ఛోటా కే నాయుడు వెల్లడించాడు.
Also Read
- Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
- Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
- Alias Rukmini : నితిన్ 'అలియాస్ రుక్మిణి' రిలీజ్ డేట్ ఫిక్స్.. హిట్టు కొట్టాల్సిందే
- Prabhas - Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
తాజావార్తలు
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
-
Hong Kong Sixes 2026: భారత్‌తో పోరుకు పాకిస్థాన్ టీమ్ ప్రకటన.. ఆరు ఓవర్ల మ్యాచ్.. ఒక్కో టీమ్‌లో జస్ట్ 6 గురు ప్లేయర్స్..
-
iQOO 16 Launch in India Soon: iQOO 16 త్వరలో భారత్‌లోకి.. 8400mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో అదరగొట్టనున్న ఫోన్!
-
CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు