చియాన్ విక్రమ్ అనే పేరు వినగానే శివపుత్రుడు, ఐ, శేషు లాంటి సినిమాలు గుర్తొస్తాయి. ఎలాంటి పాత్రలో అయినా మెస్మరైజ్ చేసే రేంజులో పెర్ఫార్మెన్స్ ఇవ్వడం విక్రమ్ కి వెన్నతో పెట్టిన విద్య. విక్రమ్ చేసిన సినిమాలు బోగోలేవు అనే మాటని చాలా సార్లు వినుంటాం కానీ విక్రమ్ సరిగ్గా నటించలేదు అనే మాట ఇప్పటివరకూ వినిపించలేదు. అంత క్రెడిబిలిటీ ఉన్న విక్రమ్, ఎక్కువగా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. కొత్త దర్శకులు, కొత్త కథలు అంటే విక్రమ్ ముందుంటాడు అందుకే అతని ఖాతాలో ఫ్లాప్స్ ఎక్కువగా ఉంటాయి. చాలా రోజుల తర్వాత విక్రమ్, హిట్ డైరెక్టర్ తో కలిసి సినిమా చేస్తున్నాడు. కోలీవుడ్ లో టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన ‘పా. రంజిత్’ దర్శకత్వంలో విక్రమ్ నటిస్తున్న సినిమా ‘తంగలాన్’. స్టూడియో గ్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై హ్యూజ్ హైప్ ఉంది. విక్రమ్ కెరీర్ లోనే మోస్ట్ హైప్డ్ మూవీగా తంగలాన్ తెరకెక్కుతోంది.
Read Also: Ugram: యాక్షన్ సినిమా నుంచి ఫ్యామిలీ సాంగ్…
జీవీ ప్రకాష్ మ్యూజిక్ హైలైట్ గా, మాళవిక మోహనన్ హీరోయిన్ గా భారి బడ్జట్ తో రూపొందుతున్న తంగలాన్ సినిమా అప్డేట్ కోసం ఫాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపధ్యంలో డిజైన్ చేసిన పీరియాడిక్ డ్రామాగా రానున్న తంగలాన్ సినిమా షూటింగ్ 80% కంప్లీట్ అయ్యింది, బాలన్స్ 20%ని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని పా.రంజిత్ తెలిపాడు. ఇటివలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పా.రంజిత్ మాట్లాడుతూ… “KGF సెట్స్ లో 55 రోజుల పాటు షూటింగ్ కంప్లీట్ చేసాం, ఇంకో 25 రోజులు బయట చెయ్యాల్సి ఉంది. CG, VFX వర్క్స్ హ్యుజ్ స్కేల్ లో ఉంటాయి. ఆ వర్క్ ఇన్ టైములో కంప్లీట్ చేసి ఈ ఏడాది చివరలో తంగలాన్ సినిమాని రిలీజ్ చేస్తాం” అని చెప్పాడు. విక్రమ్ సరికొత్త గెటప్ లో కనిపించనున్న ఈ మూవీతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.
