Chiyaan 61st Film In Kolar Gold Field Backdrop: బ్యాక్ టూ బ్యాక్ ‘కోబ్రా’, ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చియాన్ విక్రమ్… తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఇటీవల ఆరోగ్యపరమైన ఇబ్బందులనూ ఫేస్ చేసిన విక్రమ్ తిరిగి నటుడిగా కెమెరా ముందుకు రావడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. అతని తాజా చిత్రానికి సంబంధించిన టెస్ట్ షూట్ ను ఈ రోజు చెన్నయ్ లో ప్రారంభించారు. విక్రమ్ నటిస్తున్న ఈ 61వ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తుండగా, పా రంజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు.
1800 సంవత్సరానికి చెందిన ఈ పిరియడ్ డ్రామాను రంజిత్… కోలార్ గోల్డ్ ఫీల్డ్ నేపథ్యంలో తీయబోతున్నాడని, పాన్ ఇండియా మూవీగా దీని రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని, దానితో పాటుగా త్రీడీలో చేస్తున్నారని తెలుస్తోంది. దర్శకుడు పా రంజిత్ ఇప్పటి వరకూ తెరకెక్కించిన చిత్రాలను గమనిస్తే బలమైన సామాజికాంశంతో పాటుగా, హీరో హీరోయిన్ల పాత్రలను చాలా బలంగా, ప్రభావవంతంగా తెరకెక్కిస్తాడు. ఇందులోనూ పాత్రలు అలాంటివే అని అంటున్నారు. అతి త్వరలో దీని రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఆ సమయంలో మిగిలిన వివరాలను అధికారికంగా ప్రకటిస్తారట.
