Site icon NTV Telugu

Journey To Ayodhya: ‘జర్నీ టు అయోధ్య’ మొదలుపెట్టిన నిర్మాత వేణు

Journey To Aodhya

Journey To Aodhya

Chitralayam Studios Production No 2 Journey To Ayodhya announced: జగదభిరాముడు, సకల గుణధాముడు..ధర్మ రక్షకుడు, ఏకపత్నీవ్రతుడు అయినా రామయ్యను స్మరిస్తూ అనంత కోటి భక్తజనం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగ శ్రీరామనవమి. ఈ ప‌ర్వ‌దినం రోజున ప్యాష‌నేట్ ప్రొడ్యూస‌ర్ వేణు దోనేపూడి త‌న చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.2ను అనౌన్స్ చేశారు. శ్రీరామ నవమి రోజే ‘జర్నీ టు అయోధ్య’ అనే వ‌ర్కింగ్ టైటిల్ తో సినిమాను అనౌన్స్ చేయడం గమనార్హం. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.ఎన్‌.ఆదిత్య క‌థ‌ను అందిస్తున్న ఈ సినిమాను ఒక యంగ్ డైరెక్టర్ డైరెక్ట్ చేయనున్నాడు. రామాయ‌ణంపై, రామాయ‌ణంను ఆధారంగా చేసుకుని ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సినిమాలు వ‌చ్చాయి. ఎంద‌రో గొప్ప గొప్ప న‌టీన‌టులు సీతా రాములుగా, రావ‌ణ‌, ల‌క్ష్మ‌ణ‌, ఆంజ‌నేయులుగా న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించగా ఇప్పుడు అదే బాట‌లో రామాయ‌ణంను తెర‌కెక్కించ‌టానికి నిర్మాత వేణు దోనేపూడి సిద్ధ‌మ‌య్యారు.

Vadakkan: తెలుగులోకి డబ్ కానున్న మరో మలయాళీ మూవీ

వి.ఎన్‌.ఆదిత్య‌ నేతృత్వంలో ఒక‌ టీమ్ ఈ చిత్రానికి సంబంధించి అయోధ్య స‌హా ప‌లు చోట్ల‌ లోకేషన్స్ రెక్కీ నిర్వహిస్తున్నారని, ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌న్నారు మేక‌ర్స్‌. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో, భారీగా నిర్మించబోతున్న ఈ ప్యాన్ ఇండియా చిత్రానికి నిర్మాణ సారధ్యం తమ్మారెడ్డి భరద్వాజ వహిస్తున్నారు. ప్ర‌స్తుతం చిత్రాల‌యం స్టూడియోస్ బ్యాన‌ర్ పీపుల్ మీడియా బ్యాన‌ర్‌తో క‌లిసి గోపీచంద్‌, శ్రీనువైట్ల కాంబినేష‌న్‌లో ‘విశ్వం’ సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ రాముడి సినిమా రెండో సినిమా కానుంది.

Exit mobile version