NTV Telugu Site icon

Chithha: చిత్తాగా వస్తున్న సిద్దార్థ్.. ఈసారి గట్టిగా కొట్టేలానే ఉన్నాడే

Siddu

Siddu

Chithha: చాక్లెట్ బాయ్ గా సిద్దార్థ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తరువాత లవర్ బాయ్ గా మారాడు. ఇప్పటికీ 40 పదుల వయస్సులో కూడా లవర్ బాయ్ లానే మెయింటైన్ చేస్తూ అందరికి షాక్ ఇస్తున్నాడు. బొమ్మరిల్లు సినిమాతో తెలుగులో సిద్ధుకు ఫ్యాన్స్ పెరిగిన విషయం తెల్సిందే. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ వచ్చిన సిద్దు కొన్నేళ్ళకు టాలీవడ్ కు గ్యాప్ ఇచ్చాడు. ఇప్పుడిప్పుడే మరోసారి తెలుగువారికి దగ్గరకావడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఈ మధ్యనే టక్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిద్దార్థ్ వారిని అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం సిద్దు ఇండియన్ 2 లో కమల్ తో పాటు ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత సిద్దార్థ్ నటిస్తున్న చిత్రం చిత్తా. SU అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈటాకీ ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తుండగా.. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై హీరో ఉదయనిధి స్టాలిన్ రిలీజ్ చేస్తున్నారు.

Pawan Kalyan: అది రా పవన్ రేంజ్.. వేరే ఏ హీరోకు లేదు ఈ రికార్డ్

ఇక తాజాగా ఈ సినిమాలో సిద్దు ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా కోలీవుడ్ నటుడు జయం రవి రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాడు. పోస్టర్ లో సిద్దు లుక్ చాలా యూనిక్ గా ఉంది. గెడ్డం, మీసాలతో సిద్దు ఎంతో ఇంటెన్స్ గా కనిపించాడు. ఆ కళ్ళలో ఏదో నిరాశ, నిస్పృహ కనిపిస్తున్నాయి. ఇక ఇలాంటి కథ అంతకు ముందు ఎప్పుడు రాలేదని జయం రవి చెప్పడం విశేషం. పోస్టర్ ను బట్టి.. సిద్దు చాలా డిఫరెంట్ గా కనిపించాడు. చిత్తా తో సిద్దు ఈసారి గట్టిగా కొట్టేలానే ఉన్నాడు అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా సిద్దు కెరీర్ కు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.

Show comments