Site icon NTV Telugu

Chiru: మెగాస్టార్ మాటిచ్చాడా? మరో సినిమా చేస్తాడా?

Chiru

Chiru

2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ వైబ్స్ ని ఇస్తూ వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ ఇచ్చిన రిజల్ట్ అండ్ రిపీట్ వాల్యూ మెగా ఫాన్స్ లో జోష్ నింపింది. చిరు రీఎంట్రీ తర్వాత ఈ రేంజ్ హిట్ లేకపోవడంతో డీలా పడిన ఫాన్స్ కి వాల్తేరు వీరయ్య సినిమా కొత్త ఎనర్జీని ఇచ్చింది. ఇదే జోష్ లో చిరు ఆగస్టు 11న భోళా శంకర్ సినిమాతో మరో హిట్ కొడతాడు అనుకున్న ఫ్యాన్స్ కి మెహర్ రమేష్ ఊహించని షాక్ ఇచ్చాడు. అవుట్ డేటెడ్ డైరెక్షన్ తో భోళా శంకర్ ని ఫ్యాన్స్ కూడా డిజప్పాయింట్ అయ్యేలా తెరకెక్కించాడు మెహర్ రమేష్. దీంతో బ్యాక్ టు బ్యాక్ రెండో హిట్ కొడతాడు అనుకున్న చిరు కెరీర్ బిగ్గెస్ట్ ఫ్లాప్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. హిట్, ఫ్లాప్ అనేది ఇండస్ట్రీలో సర్వసాధారం అనే విషయం మరిచిపోయిన కొందరు మాత్రం అత్యుత్సాహం చూపిస్తూ, చిరుని తక్కువ చేస్తూ సోషల్ మీడియాలో నెగటివ్ కామెంట్స్ అండ్ ట్రోలింగ్ చేసారు. చిరుకి రెమ్యునరేషన్ ఇవ్వడానికి, భోళా శంకర్ తెచ్చిన నష్టాలని పూడ్చడానికి అనిల్ సుంకర ఏవేవో అమ్ముకున్నాడు, తాకట్టు పెట్టుకున్నాడు అనే రూమర్స్ ని కూడా స్ప్రెడ్ చేసారు.

ఈ మ్యాటర్ లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ అఫీషియల్ గా స్పందిస్తూ బేస్ లెస్ రూమర్స్ ని నమ్మకండి అంటూ క్లారిటీ ఇస్తూ, అనవసర విషయాల గురించి పట్టించుకోకండి అంటూ ఫ్యాన్స్ కి కూడా విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో చిరు ఇంకా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. తక్కువ రెమ్యునరేషన్ తీసుకోని, ప్రొడ్యూసర్ అండ్ బయ్యర్స్ కి హెల్ప్ అయ్యేలా ఒక సినిమా చేస్తానని చిరు మాటిచ్చాడట. ఇందులో ఎంత వరకూ నిజం ఉందనే విషయం తెలియదు కానీ చిరు గురించి బాగా తెలిసిన వాళ్లు మాత్రం ఈ టాక్ లో నిజముంది అంటున్నారు. మరి ఈ విషయంలో అఫీషియల్ క్లారిటీ ఏమైనా వస్తుందేమో చూడాలి.

Exit mobile version