NTV Telugu Site icon

Chiru: నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందిరా…

Chiru

Chiru

మూడున్నర దశాబ్దాలుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా టాప్ ప్లేస్ లో కూర్చున్న హీరో చిరంజీవి. చిరు నట వారసుడిగా చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. మొదటి సినిమాతోనే తెలుగు సినీ అభిమానులని మెప్పించిన చరణ్, ఆ తర్వాత అత్యంత తక్కువ సమయంలోనే స్టార్ హీరో అయ్యాడు. నటించింది 15 సినిమాలే అయినా మూడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు చరణ్. ఇంత తక్కువ సమయంలో ఏ స్టార్ హీరోకి కూడా ఈ రేంజ్ హిట్స్ లేవు. మగధీర, రంగస్థలం లాంటి సినిమాలతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న రామ్ చరణ్… ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఏకంగా తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు.

Read Also: Balayya: ఏంటయ్యా నవదీప్ నీ నాన్సెన్స్… డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకడమేగా

ఈ జనరేషన్ లో అందరు హీరోలు పాన్ ఇండియా ఇమేజ్ కోసం ట్రై చేస్తుంటే రామ్ చరణ్ కి మాత్రం గ్లోబల్ స్టార్ ఇమేజ్ దొరికింది. ఈ విషయంలో ప్రౌడ్ ఫాదర్ గా చిరంజీవి ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే ప్రౌడ్ ఆఫ్ యు నాన్న అంటూ ట్వీట్ చేసి మరీ చరణ్ కి పుట్టిన రోజు విషెస్ చెప్పాడు. చరణ్ కి ముద్దు పెడుతున్న ఫోటోని పోస్ట్ చేస్తూ చిరు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. చరణ్ నటిస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమాకి సంబంధించిన సాంగ్ షూటింగ్ ఇటివలే కంప్లీట్ అయ్యింది. ఈ సాంగ్ లో చరణ్ కనిపించే లుక్ లోనే ఉంది చిరు పోస్ట్ చేసిన ఫోటో. తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఆప్యాయతని చూసి మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Show comments