Site icon NTV Telugu

Chiru: బాస్ మాస్ పూనకాలు తెప్పించి ఏడాది అయ్యింది…

Chiru

Chiru

మెగాస్టార్ చిరంజీవిని వింటేజ్ మోడ్ లో చూపిస్తూ ఆడియన్స్ ముందుకి వచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య. 2023 సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న రిలీజైన వాల్తేరు వీరయ్య చిరు కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బాసుని చూసి మాస్ ఆడియన్స్ పూనకాలు వచ్చేలా ఊగిపోయారు. చిరుకి రవితేజ కూడా కలవడంతో ఈ ఇద్దరినీ చూడడానికి ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కట్టారు. ఇంటర్వెల్ బ్లాక్ కి ఒక మాస్ హిస్టీరియాని క్రియేట్ చేస్తూ మెగా ఫ్యాన్స్ థియేటర్స్ టాప్ లేపారు. ఇలాంటి చిరంజీవిని కదా ఇన్ని రోజులు మిస్ అయ్యింది, ఈ చిరంజీవిని కదా ఇన్ని రోజులు చూడాలి అనుకుంది అనిపించే రేంజ్ బొమ్మ వాల్తేరు వీరయ్య.

మెగా ఫ్యాన్స్ అందరినీ ఒక్కసారిగా జోష్ లోకి తెచ్చిన వాల్తేరు వీరయ్య రిలీజ్ అయ్యి ఏడాది అయిన సందర్భంగా చిరు స్పెషల్ ఆడియో రిలీజ్ చేసాడు. అవనిగడ్డలోని రామకృష్ణ థియేటర్ కి వాల్తేరు వీరయ్య సినిమా గత 365 రోజులుగా ఆడుతూనే ఉంది. ఈ విషయం గురించి కూడా చిరు మాట్లాడుతూ… ” 365 రోజులు ఒక సినిమా ఆడడం చాలా గొప్ప విషయం. ఎవరు అచీవ్ చేయలేని ఈ ఫీట్ ని సాధించింది వాల్తేరు వీరయ్య సినిమా” అని చెప్తూ చిరు దర్శకుడు బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, ప్రొడ్యూసర్స్ మైత్రీ మూవీ మేకర్స్… ఇలా వాల్తేరు వీరయ్య సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున థాంక్స్ చెప్పాడు చిరు. ఇలాంటి సినిమా ఇంకొక్కటి పడితే రీజనల్ బాక్సాఫీస్ దగ్గర బాస్ కలెక్షన్స్ తో తాండవం చేయడం గ్యారెంటీ.

Exit mobile version