Site icon NTV Telugu

God Father : మొదలైన చిరు – సల్మాన్ సాంగ్ పిక్చరైజేషన్!

God

God

Chiru – Salman’s song picturisation Started!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మలయాళ చిత్రం ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ ‘గాడ్ ఫాదర్’లో సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసింది. తాజాగా చిరంజీవి, సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో ఓ పాటను గ్రాండ్ వే లో చిత్రీకరించడం మొదలెట్టారు దర్శకుడు ‘జయం’ మోహన్ రాజా. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ట్వీట్ చేసి నెటిజన్లకు తెలిపారు. ప్రభుదేవా నృత్య దర్శకత్వంలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోందని, అతని కొరియోగ్రఫీలో ఇది ది బెస్ట్ గా నిలుస్తుందని, ఇదో కన్నుల పండవ మాదిరి ఉంటుందని చిరంజీవి తెలిపారు. ఈ సెట్ సాంగ్ కు సంబంధించిన ఫోటోను కూడా ఆయన పోస్ట్ చేశారు.

ఇటీవల ‘గాడ్ ఫాదర్’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. చిరంజీవి తొలిసారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో, బ్లాక్ షేడ్స్ ధరించి, కుర్చీలో కూర్చొన్న ఫస్ట్ లుక్ పోస్టర్ మెగా మార్వలెస్ గా వుంది. చిరంజీవి పాత్రను పరిచయం చేసిన ఈ గ్లింప్స్ వీడియోకు ఎక్స్ టార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. నయనతార కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో పాటు పూరి జగన్నాథ్, సత్యదేవ్ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలోవిడుదల కాబోతున్న ‘గాడ్ ఫాదర్’ మూవీని ఆర్‌బి చౌదరి , ఎన్‌వి ప్రసాద్ నిర్మిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version