Chiru: మంగళవారం సినిమాకి మెగాస్టార్ సపోర్ట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒక చిన్న సినిమా, మంచి సినిమా వస్తుంది అంటే అది తన ఫ్యామిలీ హీరో సినిమానా? లేక బయట హీరో సినిమానా అనేది చూడకుండా సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేయడం చిరంజీవికి అలవాటు. ప్రతి సినిమా గురించి మాట్లాడే చిరు… ఇటీవలే మిస్ శెట్టి మిస్టర్ పలిశెట్టి సినిమాకి ఫస్ట్ ఆడియన్స్ గా మారి రివ్యూ ఇచ్చారు. చిరు మాటని నిజం చేస్తూ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు చిరు నుంచి అలాంటి సపోర్ట్ నే సొంతం చేసుకుంది ‘మంగళవారం’ సినిమా. ఆర్జీవీ శిష్యుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో… పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా మంగళవారం. నవంబర్ 17న రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్ కొన్ని గంటల ముందే రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సూపర్బ్ ట్రైలర్ కట్ తో థ్రిల్ చేసిన అజయ్ భూపతి… సాలిడ్ హిట్ కొట్టేలా ఉన్నాడు.
ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేస్తూ చిరు సోషల్ మీడియాలో ట్వీట్ చేసాడు. “మంగళవారం సినిమా నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి,సురేష్ వర్మ నాకు సన్నిహితులు. ముఖ్యంగా స్వాతి రెడ్డి, ఎంతో డైనమిక్ అమ్మాయి. మా అమ్మాయి శ్రీజ కి మంచి స్నేహితురాలు. నాకు యువత, అందులోనూ యంగ్ విమెన్ సినిమా ఇండస్ట్రీ లో వివిధ శాఖల్లో కి ఎంటర్ అవుతుంటే చాలా ఎక్సైటింగ్ గా వుంటుంది. వాళ్ళు వాళ్ళ కొత్త ఆలోచనలు, న్యూ ఎనర్జీ తో ఫిలిం మేకింగ్, మార్కెటింగ్ లకి ఒక కొత్త డైరెక్షన్ ని ఇవ్వగలరు. అందుకని స్వాతిరెడ్డి లాంటి యంగ్ స్టర్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి అజయ్ భూపతి లాంటి ఓ టాలెంటెడ్ డైరెక్టర్ తో కలిసి తొలి ప్రయత్నంగా ఈ సినిమా చేయటం ఎంతో సంతోషం. విలేజ్ నేపథ్యంలో రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ నా చేతుల మీదుగా రిలీజ్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటూ ఎంటైర్ టీంకి ఆల్ ది బెస్ట్” అంటూ చిరు ట్వీట్ చేసాడు. మరి చిరు చేసిన ట్వీట్ ని నిజం చేస్తూ మంగళవారం సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
‘మంగళవారం' సినిమా నిర్మాతలు స్వాతి రెడ్డి గునుపాటి,సురేష్ వర్మ నాకు సన్నిహితులు. ముఖ్యంగా స్వాతి రెడ్డి, ఎంతో డైనమిక్ అమ్మాయి. మా అమ్మాయి శ్రీజ కి మంచి స్నేహితురాలు. నాకు యువత, అందులోనూ యంగ్ విమెన్ సినిమా ఇండస్ట్రీ లో వివిధ శాఖల్లో కి ఎంటర్ అవుతుంటే చాలా ఎక్సైటింగ్ గా…
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 21, 2023
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!