Site icon NTV Telugu

13 ఏళ్ల తర్వాత బ్రాండ్‌ అంబాసిడర్ గా చిరు

megastar

megastar

మెగాస్టార్ చిరంజీవి దాదాపు 13 సంవత్సరాల తర్వాత బ్రాండ్ అంబాసిడర్ గా చేయబోతున్నారు. రాజకీయాలనుంచి తప్పుకుని ‘ఖైదీ నెం.150’తో సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చిన చిరు అనూహ్యవిజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం జోరుమీదున్న చిరంజీవి వరుసగా నాలుగైదు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టాడు. ఆయన నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత చిరు లైనప్ చూస్తే ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉన్న యువహీరోలకు దీటుగా సాగుతున్నట్లు అర్థం అవుతుంది.

చిరు వర్సెస్ చరణ్..

ఇక తాజాగా ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసినట్లు తెలుస్తోంది. చిరు సైన్ చేసిన బ్రాండ్ అధికారిక ప్రకటన త్వరలో రానుంది. ఇప్పటికే మహేశ్ బాబు వంటి హీరోలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్స్ గా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు చిరంజీవి తనయుడు రామ్ చరణ్‌ కూడా రియల్ ఎస్టేట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ చేయటం విశేషం. సో వార్ రియల్ ఎస్టేట్ కంపెనీల మధ్య అనే కంటే తండ్రీ కొడుకుల మధ్య అనటం బెటర్ ఏమో… మరి ఈ వార్ లో ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి.

Exit mobile version