Site icon NTV Telugu

“చిరు 153” రీమేక్ షూటింగ్ షురూ

Chiru 153: Lucifer Telugu remake starts with an action

“ఆచార్య” చిత్రాన్ని పూర్తి చేసిన మెగాస్టార్ “చిరు 153” రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేసేశారు. సూపర్ హిట్ అయిన మలయాళ పొలిటికల్ డ్రామా “లూసిఫర్” తెలుగు రీమేక్ షూటింగ్ ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మొదట్లోనే యాక్షన్ సీక్వెన్స్‌తో షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ క్రేజీ రీమేక్‌కు ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు మోహన్ రాజా ట్విట్టర్‌లో వెళ్లి చిత్ర ప్రధాన బృందంతో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నారు. “లూసిఫర్” రీమేక్‌ను రామ్ చరణ్, ఎన్‌వి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Read Also : ‘మంచి రోజులు వచ్చాయి’ సాంగ్ ప్రోమో రిలీజ్

సినిమాటోగ్రాఫర్ నిరవ్ షా, స్టార్ యాక్షన్ కొరియోగ్రాఫర్ స్టన్ సిల్వా, ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ సురేష్ రాజన్ ఈ సినిమాలో భాగం అయ్యారు. చిరంజీవి 153వ చిత్రంగా ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రానికి “గాడ్ ఫాదర్” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. చిత్ర తారాగణం, సిబ్బంది గురించి మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సినిమా తరువాత చిరంజీవి తమిళ మూవీ “వేదాళం” రీమేక్ ను కూడా పట్టాలెక్కించనున్నాడు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్నారు.

Exit mobile version