అగ్ర కథానాయకుడు చిరంజీవి హీరోగా, దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు (MSG)’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో చిరుతో పాటు టీమ్ మొత్తం ఫుల్ ఎనర్జీతో ఉన్నారు. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి ఓ కీలక అప్‌డేట్ షేర్ చేశారు. సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న నయనతార పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆమె ఈ చిత్రంలో శశిరేఖ పాత్రలో కనిపించనున్నారు.
Also Read : Peddi : రామ్ చరణ్ వర్కింగ్ స్టైల్ కు ఫిదా అయ్యా.. అంటున్న జాన్వీ
నయనతారతో కలిసి వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేస్తున్నానని అనిల్ తెలిపారు. ఆమె పాత్ర సినిమాకు మరింత అందాన్ని తెస్తుందని.. అలాగే దసరా సందర్భంగా మరో పెద్ద సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు కూడా దర్శకుడు స్పష్టం చేశారు. ఇప్పటికే కేరళలో కొన్ని షెడ్యూల్స్ పూర్తి చేసిన టీమ్, ప్రస్తుతం హైప్ క్రియేట్ చేసే సాంగ్స్ షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ పాటలు చిరు కెరీర్‌లోనే కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని యూనిట్ నమ్మకంగా చెబుతోంది. 2026 సంక్రాంతికి ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసి ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక అక్టోబర్ 5 నుంచి మరో అగ్రనటుడు వెంకటేశ్ కూడా షూటింగ్‌లో జాయిన్ కానున్నారు.
