Site icon NTV Telugu

Upasana: మా కుటుంబానికి ఆమెనే బలం, ధైర్యం : ఉపాసన

Untitled Design (37)

Untitled Design (37)

మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఫ్యామిలీ తగ్గట్టుగానే ఎంతో భాద్యతగా ఉంటుంది. ఒకపక్క రామ్ చరణ్ కు భార్యగా.. ఫ్యామిలీకి కోడలుగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే.. మరోపక్క అపోలో హాస్పిటల్ వైస్ చైర్మన్ గా , సోషల్ యాక్టివిటీగా ఆమె సేవలు అందిస్తుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. తరచూ తన పర్సనల్ అలాగే ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటూ ఉంటుంది.ఇదిలా ఉంటే ఈ రోజు చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది రామ్ చరణ్ సతీమణి ఉపాసన..

Also Read:Shah Rukh Khan: సౌత్ స్టార్‌లు ఆ విషయంలో కొంచెం తగ్గితే మంచిది : షారుఖ్ ఖాన్

అంజనా దేవి తో దిగిన ఫోటో పంచుకుంటు ‘ఎంతో ప్రేమించే, క్రమశిక్షణ కలిగిన నానమ్మకు హ్యాపీ బర్త్ డే. నీతో కలిసి జీవించడం ఎంతో సంతోషంగా ఉంది. యోగా క్లాస్ పూర్తయిన తర్వాత మా ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది. కానీ ఆమె ఒక్క క్లాస్ కూడా మిస్ కాలేదు. తనకు అసలు అలసట అనేది తెలియదు. నిజంగా ఈ విషయంలో ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాల్సిందే. మా ఈ కుటుంబానికి బలం, ధైర్యం అంజనాదేవి. కుటుంబ విలువలు, ఓర్పు, సహనం, క్రమశిక్షణ వంటి విషయాలు ఆమె నుంచి నేర్చుకోవాలని’ అంటూ వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు, వీడియోలను ఉపాసన పంచుకుంది. ప్రజంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

 

Exit mobile version