Site icon NTV Telugu

Chiranjeevi : గద్దర్ అవార్డుల విజేతలకు కంగ్రాట్స్.. చిరంజీవి ట్వీట్

Chiranjeevi

Chiranjeevi

Chiranjeevi : తెలంగాణ ప్రభుత్వం చాలా ఏళ్ల తర్వాత సినిమా ఇండస్ట్రీకి గద్దర్ అవార్డులను ప్రకటించింది. అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా(పుష్ప)కి సెలెక్ట్ అయ్యారు. అలాగే ఉత్తమ నటిగా నివేదా థామస్, ఉత్తమ చిత్రంగా కల్కి ఎంపికయ్యాయి. విజేతలకు కంగ్రాట్స్ చెబుతూ సినీ ప్రముఖులు ఇప్పటికే పోస్టులు పెడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేశారు. అవార్డులు పొందిన వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కళా రంగంలో ఉన్న వారికి కచ్చితంగా గుర్తింపు అనేది అవసరం. అది కళను మరింత అద్భుతంగా మార్చేలా చేస్తుంది.

Read Also : Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మధ్యంతర బెయిల్‌ మంజూరు

తెలంగాణ ప్రభుత్వం తిరిగి ప్రారంభించిన అవార్డులు పరిశ్రమకు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. అవార్డులు తిరిగి ప్రారంభించడంలో కృషి చేసిన సీఎం రేవంత్ కు, అలాగే ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చారు చిరంజీవి. ఈ రోజు జయసుధ నేతృత్వంలోని జ్యురీ గద్దర్ అవార్డులను ప్రకటించింది. అన్ని రకాల కేటగిరీల్లో అవార్డులను అందజేశారు. ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ కు అవార్డు దక్కింది. అవార్డు అందుకున్న వారికి సెలబ్రిటీలు స్పెషల్ విషెస్ చెబుతున్నారు.

ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాను కంప్లీట్ చేస్తున్నారు. అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న సినిమాను కూడా ఇప్పటికే స్టార్ట్ చేశారు. ఆ మూవీ షూటింగ్ ఇప్పటికే ప్రారంభించారు. వచ్చే సంక్రాంతికి మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒకేసారి రెండు సినిమాలను కంప్లీట్ చేసేందుకు చిరంజీవి వరుస షూటింగులతో బిజీ బిజీగా ఉంటున్నారు.

Read Also : Kamal Haasan : కన్నడ భాషపై వ్యాఖ్యలు.. కమల్ హాసన్ పై కేసు

Exit mobile version