Godfather విషయంలో ఇప్పటి వరకూ ప్రచారమైన రూమర్స్ ను నిజం చేస్తూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళ సూపర్ హిట్ చిత్రం ‘లూసిఫర్’ తెలుగు రీమేక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. Godfather అనే ఆసక్తికరమైన టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముఖ్యమైన పాత్రలో కన్పించబోతున్నారని చాలా కాలంగా టాక్ నడుస్తోంది. ఇక ఇటీవలే చిరు… సల్మాన్ ను కలవడానికి ముంబై వెళ్లినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలను నిజం చేస్తూ చిరంజీవిని Godfather టీంలోకి ఆహ్వానించారు చిరు.
Read Also : The Kashmir Files : అప్రతిష్టపాలు చేసేందుకు కుట్ర… ప్రధాని సంచలన వ్యాఖ్యలు
“భాయ్ సల్మాన్ ఖాన్ వెల్కమ్ అబోర్డ్ #గాడ్ ఫాదర్… మీ ప్రవేశం ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచింది. ఉత్సాహం తదుపరి స్థాయికి వెళ్లింది. మీతో స్క్రీన్‌ను పంచుకోవడం ఒక సంపూర్ణమైన ఆనందం. మీ ఉనికి ప్రేక్షకులకు ఆ అద్భుత #కిక్‌ని ఇస్తుందనడంలో సందేహం లేదు” అంటూ సల్మాన్ తో కలిసి ఉన్న పిక్ ను షేర్ చేశారు. ఇక ఇప్పటికే ముంబై సబర్బన్స్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో సల్మాన్ ఈరోజు నుంచి చిరంజీవితో షూటింగ్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం. తెలుగు రీమేక్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్‌ను సల్మాన్ పోషిస్తుండగా, ఒరిజినల్ మూవీలోని మోహన్‌లాల్ పాత్రలో చిరంజీవి కనిపించనున్నారు. ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్ కంచరణా, హరీష్ ఉత్తమన్, సచిన్ ఖేడేకర్, నాజర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని నీరవ్ షా హ్యాండిల్ చేస్తుండగా, సంగీతం తమన్ అందిస్తున్నారు. సినిమా మొదటి కట్‌ని దర్శకుడు మోహన్ రాజా స్వయంగా ఎడిట్ చేయనుండగా, ఫైనల్ కట్‌ను బహుళ జాతీయ అవార్డులు గెలుచుకున్న ఎడిటర్ ఎ.శ్రీకర్ ప్రసాద్ చేస్తారు. 260 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.
