Site icon NTV Telugu

MVG : ‘మన శంకర వరప్రసాద్ గారు’ పై కేర్ పెంచిన మేకర్స్ !

Mng

Mng

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన “మీసాల పిల్ల” సాంగ్ ప్రోమో అభిమానులను ఆకట్టుకోగా, కొంతమంది యాంటీ ఫ్యాన్స్ మాత్రం దానిని ట్రోల్ చేశారు. దీంతో మేకర్స్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికొచ్చే ప్రతి కంటెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకున్నారు.

ఇక “మీసాల పిల్ల” ఫుల్ సాంగ్ విషయానికొస్తే, మెగాస్టార్ చిరంజీవి తన ప్రత్యేక గ్రేస్‌తో స్క్రీన్‌ను డామినేట్ చేయనున్నారని, భీమ్స్ అందించిన మ్యూజిక్, సీనియర్ సింగర్ ఉదిత్ నారాయణ్ వోకల్స్ ఈ పాటను మరింత బలంగా నిలబెట్టనున్నాయని సమాచారం. మరోవైపు, ఈ సినిమాలో నయనతార ‘శశిరేఖ’ పాత్రలో కనిపిస్తారని అనిల్ రావిపూడి వెల్లడించారు. ప్రస్తుతం ప్రత్యేకంగా వేసిన సెట్‌లో పాటల చిత్రీకరణ వేగంగా సాగుతోంది.

ఈ భారీ ప్రాజెక్ట్‌ను సాహు గారపాటి మరియు సుస్మిత కోణిదెల (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక అక్టోబర్ 5 నుంచి వెంకటేష్ షూటింగ్‌లో జాయిన్ కానున్నట్లు సమాచారం. ఫ్యాన్స్ అయితే ఈ సినిమాను మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌కి పక్కా విజువల్ ట్రీట్‌గా భావిస్తున్నారు.

Exit mobile version