Site icon NTV Telugu

Chiranjeevi: నాలుగేళ్ళ చిన్నారిపై అత్యాచారం.. ఎమోషనల్ అయిన చిరు

Chiru

Chiru

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాలతో ఎంత ప్రభావితం చేస్తారో తన ట్వీట్స్ తో కూడా అభిమానులను కూడా అంతే ప్రభావితం చేస్తారు. సమాజంలో జరిగిన కొన్ని ఘటనలు తనకు తప్పుగా అనిపిస్తే వాటిపై తన అభిప్రాయాన్ని తెలిపి అభిమానులను జాగ్రత్తగా ఉండమనడం కానీ, ఈ విధంగా చేయండి అని కానీ సలహాలు ఇస్తూ ఉంటారు. తాజాగా ఒక చిన్నారిపై జరిగిన ఆత్యాచారం ఘటన తనను కలిచివేసిందని చిరు ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ అయ్యారు. మూడు రోజుల క్రితం బంజారాహిల్స్ లోని ఒక పబ్లిక్ స్కూల్ లో నాలుగేళ్ళ చిన్నారిపై జరిగిన అత్యాచారం ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మగాళ్లు మృగాళ్ళుగా మారి చిన్నారి నిండైన జీవితాన్ని నలిపేశారు. అందరి మనసును బరువెక్కించిన ఈ ఘటనపై చిరంజీవి స్పదించారు.

ట్విట్టర్ వేదికగా చిరు అందరికి సీసీటీవీ ఫుటేజ్ లు పెట్టించడం వలన ఇలాంటి అనర్దాలను అడ్డుకోవచ్చని తెలిపారు. “నాలుగేళ్ల పసిబిడ్డ పై స్కూల్ లో జరిగిన అత్యాచారం,అఘాయిత్యం నన్ను బాగా కలచివేసింది. ఆటవిక సంస్కృతి నుండి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించడమే కాకుండా, ప్రభుత్వాలు అన్ని విద్యాసంస్థల్లో సి.సి. టీవీ కెమెరాల ఏర్పాట్లకు యుద్ధప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. భావితరాలకు భరోసా కల్పించడం మనందరి సమిష్టి బాధ్యతగా భావిస్తున్నాను..” అని తెలిపారు. అంతేకాకుండా ఇలాంటి ఘోరాలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలి అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version