NTV Telugu Site icon

Chiranjeevi: కేసీఆర్ కు గాయం.. చాలా భాదపడ్డాను

Kcr

Kcr

Chiranjeevi: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరిన విషయం తెల్సిందే. గతరాత్రి అయిన బాత్ రూమ్ లో కాలుజారి పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు తుంటి ఎముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. శస్త్రచికిత్స నిర్వహించాల్సి రావొచ్చని భావిస్తున్నారు. అయితే వైద్య పరీక్షలు పూర్తయ్యాక శస్త్రచికిత్సపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఇక ఈ విషయం తెలియడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీట్స్ చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్ చేశాడు. ” కేసీఆర్ గారికి జరిగిన గాయం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను.. ఆయనకు శస్త్ర చికిత్స విజయవంతమై త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇక చిరు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడు. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇందులో త్రిష, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారని టాక్. వీరితో పాటు మరో హీరోయిన్ కూడా ఉండే అవకాశం ఉందట. భోళా శంకర్ తో ప్లాప్ అందుకున్న చిరు.. ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.