NTV Telugu Site icon

Chiranjeevi: పద్మ విభూషణ్ అందుకోనున్న చిరు..ఎప్పుడంటే?

Chiranjeevi Padma Vibhushan

Chiranjeevi Padma Vibhushan

Chiranjeevi to Recieve Padma Vibhushan at Delhi: ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే.. దేశంలో వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలను ఇస్తారు. సినీ, రాజకీయ రంగాలతో పాటు అనేక రంగాల్లో తమ ఎనలేని సేవలు అందించిన ప్రముఖులు ఎందరో ఈ అవార్డులకు ఎంపిక అయ్యారు. 75వ గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు పద్మ అవార్డులను ప్రకటించారు. ఈ ఏడాది 132 మంది ప్రముఖులను పద్మ అవార్డులతో సత్కరించనున్నారు.

Etv Win: ఈటీవీ విన్లో ఈ వారం రెండు ఇంట్రెస్టింగ్ మూవీస్

వీరిలో 5 మందికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులు అందజేయనున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ప్రముఖ హిందీ సినీ నటి వైజయంతిమాల, ప్రముఖ నర్తకి పద్మా సుబ్రమణ్యం, దక్షిణాది సినీ నటులు చిరంజీవి, బిందేశ్వర్ పాఠక్ (మరణానంతరం)లకు పద్మవిభూషణ్‌తో సత్కరించనున్నారు. అదే సమయంలో, బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, ఉషా ఉతుప్, ఫాతిమా బీబీ (మరణానంతరం), ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్ నాయక్‌లకు పద్మభూషణ్ బిరుదుతో సత్కరించనున్నారు. ఇక రేపు మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు అందుకోనున్నారు. ఇక ఈ వేడుకకు చిరంజీవి భార్య సురేఖతో పాటు ఆయన కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన కూడా హాజరుకానున్నారు.