ఏపీ సినిమా టికెట్ రేట్స్ వివాదం ఒక కొలిక్కి వచ్చింది. ఎట్టకేలకు సినిమా టికెట్ రేట్స్ పెంచుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం జగన్ ని కలిసి చిత్ర పరిశ్రమలోని సమస్యలను వివరించి .. చిత్రపరిశ్రమ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి ఈ సమస్యకు పరిష్కారం అందించారు. ఇక తాజగా చిరు, సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలిపారు. సరికొత్త జీవోను అమలు చేసినందుకు ట్విట్టర్ ద్వారా జగన్ కి ధన్యవాదాలు తెలిపారు. “తెలుగు సినీ పరిశ్రమకు మేలు కలిగే విధంగా, అటు థియేటర్ల మనుగడను, ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకొని, సినిమా టికెట్ రేట్స్ సవరిస్తూ సరికొత్త జీవో జారీచేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి పరిశ్రమ తరుపున కృతజ్ఞతలు. చిన్న సినిమాకు ఐదవ షో అవకాశం కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం. సంబంధిత మంత్రి వర్యులు పేర్ని నాని గారికి, అధికారులకి, కమిటీకి ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
Thank you Sri. @ysjagan garu @AndhraPradeshCM pic.twitter.com/BsvmsEPrxt
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 7, 2022
