శ్రీకాంత్ ఓదెల తన మొదటి సినిమా ‘దసరా’ తోనే తనదైన ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే. నాని హీరోగా రూపొందిన ఈ సినిమాతో సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీకాంత్ ఓదెల, ఒక్కసారిగా రా అండ్ రస్టిక్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల నానితోనే ‘ది పారడైజ్’ అనే సినిమా అనౌన్స్ చేశాడు. ఒక్కసారిగా ఆ గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. అయితే, ఆ సినిమా అనౌన్స్మెంట్ తర్వాత ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అసలు ఆ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
Also Read : The Paradise : ‘ది పారడైజ్’ వాయిదా? అసలు నిజం చెప్పేసిన నిర్మాత!
అయితే ఆ సినిమా పీరియాడిక్ సినిమా అని తాజాగా సినిమా నిర్మాత సుధాకర్ చెరుకూరి వెల్లడించారు. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు, నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా 1970 బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని, 74 -75 తర్వాత కథ జరుగుతున్నట్లుగా ఉంటుందని, నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని సినిమా ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. మొత్తం మీద చూసుకుంటే శ్రీకాంత్ ఓదెల తాను చేస్తున్న దాదాపు అన్ని సినిమాలను పీరియడ్ జానర్ లోనే రూపొందిస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి హీరోగా కూడా పీరియాడిక్ జానర్ లోనే సినిమా చేస్తున్నారంటే కచ్చితంగా ఏదో పెద్దగానే ప్లాన్ చేసి ఉంటారని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన లుక్స్ రిలీజ్ చేసిన సమయంలో చేతులన్నీ రక్తసిక్తమైన లుక్స్‌తో ఫోటోలు రిలీజ్ చేశారు. అంటే ఈ సినిమా కూడా పూర్తిస్థాయి బ్లడ్ బాత్ తోనే చూపించబోతున్నారని క్లారిటీ వచ్చేస్తోంది. అయితే మరి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారు అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది.