మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 36వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఇప్పుడు ఏ విషయం ఉన్నా, విశేషమైన సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం, విష్ చేయడం ట్రెండ్ గా మారింది. అదే ట్రెండ్ ను ఫాలో అవుతూ సెలెబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగానే తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఏదైనా మంచి వార్త అయితే విష్ చేస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో చరణ్ ను విష్ చేయడం వింతగా ఉందంటున్నారు మెగాస్టార్. తనయుడి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పిక్ ను షేర్ చేసిన చిరంజీవి “రామ్ చరణ్ కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం నాకు వింతగా ఉంది. అయితే ఈ సందర్భంగా ఒక పిక్ ను షేర్ చేస్తే అభిమానులు ఆనందిస్తారని అన్పించింది. కొడుకుగా చరణ్ నన్ను గర్వపడేలా చేశాడు” అంటూ తనయుడిపై ప్రేమను వ్యక్తపరిచారు.
Read Also : HBD Ram Charan : ఎన్టీఆర్ ఇంట్లో బర్త్ డే సెలబ్రేషన్స్… పిక్ వైరల్
ఇక పిక్ విషయానికొస్తే… అందులో ఒకవైపు చరణ్ ను చిన్నప్పుడు చిరు ఎత్తుకుని కన్పించారు. రెండవ వైపు ‘ఆచార్య’ సినిమా షూటింగ్ సమయంలో తీసిన పిక్. అయితే యాదృచ్చికమో ఏంటో తెలియదు కానీ రెండు పిక్స్ ఒకేలా ఉండడం మెగా ఫ్యాన్స్ ను థ్రిల్ చేస్తోంది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా చెర్రీ ఇప్పుడు “ఆర్ఆర్ఆర్” హిట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఏప్రిల్ 29న ‘ఆచార్య’తో ఈ మెగా తండ్రీకొడుకులు థియేటర్లలో ప్రేక్షకులను అలరించనున్నారు.
