Site icon NTV Telugu

Ali : కమెడియన్ అలీకి చిరంజీవి స్పెషల్ గిఫ్ట్..

Ali

Ali

Ali : కమెడియన్ అలీకి చిరంజీవి ఎంతో అనుబంధం ఉంది. వీరిద్దరూ ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఈ నడుమ పెద్దగా కలిసి ఒకే స్టేజిపై కనిపించట్లేదు గానీ.. చాలా సార్లు ఒకరిపై ఒకరు అనుబంధాన్ని చూపించుకుంటున్నారు. తాజాగా అలీకి సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించారు చిరంజీవి. ప్రతి ఏడాది సమ్మర్ లో బ్రహ్మానందం, అలీకి తన తోటలో పండే మామిడి పళ్లను పంపిస్తుంటారు చిరంజీవి. ఈ సారి కూడా తన తోటలో పండిన మామిడి పళ్లను స్పెషల్ గా ప్యాక్ చేసి పంపించారు చిరు.

Read Also : Nara RohitH : నా పెళ్లి అప్పుడే.. నారా రోహిత్ క్లారిటీ..

కేవలం మామిడి పళ్లు మాత్రమే కాకుండా అందులో చిరంజీవి భార్య సురేఖ వంటకాలను కూడా పంపించారు. సురేఖ వంటకాలను అందరికీ రుచి చూపించాలనే ఉద్దేశంతో ఉపాసన అత్తమ్మాస్ కిచెన్ అనే ఫుడ్ బిజినెస్ ను ప్రారంభించింది. అందులో ఉప్మ, రసం, పొంగల్, కేసరితో పాటు.. రెడీ టు మిక్స్ పొడులను కూడా పంపించారు. వీటితో అప్పటికప్పుడు వంటలను చేసుకోవచ్చు. ఈ గిఫ్ట్ వీడియోను అలీ భార్య జుబేదా తన యూట్యూబ్, సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేసింది.

చిరంజీవి తమ మీద ఉన్న ప్రేమతో ఇవన్నీ పంపించారని చెబుతూ మురిసిపోయింది. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. దాంతో పాటు అనిల్ రావిపూడితో కలిసి చేస్తున్న మూవీ కూడా రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. అలీ ప్రస్తుతం నాలుగు సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. అతను రాజకీయాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

Read Also : Sree Leela : ఎంగేజ్ మెంట్ ఫొటోలపై స్పందించిన శ్రీలీల..

Exit mobile version