NTV Telugu Site icon

Chiranjeevi: చిరంజీవి కీలక నిర్ణయం.. ఇకపై వాటికి నో ఛాన్స్..?

Chiru

Chiru

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యనే భోళా శంకర్ సినిమాతో భారీ పరాజయాన్ని చవిచూసిన చిరు ఇలాంటి తప్పు ఇంకొకసారి చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. గత రెండు మూడేళ్లుగా చిరంజీవి రీమేక్స్ తోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెల్సిందే. ఇక ఇది చూసిన అభిమానులు దయచేసి రీమేక్స్ చేయడం మానేయమని కోరుకున్న విషయం కూడా తెలిసిందే. అయినా సరే చిరు భోళాశంకర్ లాంటి రీమేక్ చేసి అభిమానులను నిరాశపరిచాడు. ఈ మూవీ రిజల్ట్ చూసిన చిరు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. ఇకనుంచి ఆయన రీమేక్స్ చేయనని నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయం ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.

Vijay Devarakonda: ఛీఛీ.. సమంత ఇలా చీట్ చేస్తుంది అనుకోలేదు

తాజాగా ఒక నిర్మాత మలయాళ సూపర్ హిట్ సినిమా రీమేక్ రైట్స్ పట్టుకుని చిరంజీవిని కలిశారట. కానీ, చిరు నిర్మొహమాటంగా నో చెప్పేసారని సమాచారం. ఇకపై రీమేక్స్ చేయకూడదని మెగాస్టార్ నిర్ణయించుకున్నారని సమాచారం. దీంతో అభిమానులు ఆనందపడుతున్నారు. ఒకప్పుడు చిరంజీవి సినిమాలు ఎలా ఉండేయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన సినిమాల్లో ఏదో మిస్ అవుతుంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య తప్ప చిరు చేసిన సినిమాలు కొన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే. ముఖ్యంగా భోళా శంకర్ డిజాస్టర్ గా నిలిచింది. అందుకే చిరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడని టాక్. ఏది ఏమైనా ఇన్నాళ్లకు అభిమానుల బాధను చిరు అర్థం చేసుకున్నాడని ఫాన్స్ అంటున్నారు. ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది

Show comments