Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్న విషయం తెల్సిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిరు వరుస ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇక మొదటి సారి ఈ సినిమా ప్రమోషన్స్ లో చిరంజీవి తన వ్యక్తిగత విషయాల గురించి నోరు విప్పారు. ఒకటి కాదు రెండు ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఒకానొక సమయంలో చిరంజీవి మీద విష ప్రయోగం జరిగినట్లు అందరికి తెల్సిందే. అయితే ఇన్నేళ్ల తరువాత ఆ విష ప్రయోగం ఎవరు చేశారో చిరంజీవి చెప్పుకొచ్చారు. మరణ మృదంగం షూటింగ్ సమయంలో తనపై తన సొంత అభిమానినే అని చెప్పుకొచ్చాడు.
“మరణ మృదంగం సినిమా సెట్ లో ఒక కేక్ కట్ చేశాం. నాకు కేక్ ను స్పూన్ తినడం అలవాటు లేదు. అయితే ఒక వ్యక్తి తన చేత్తో నాకు బలవంతంగా కేకు తినిపించాడు. కానీ, ఆ కేకు చేదుగా ఉండడంతో నేను వెంటనే ఊసేశాను. ఇక ఆ విషయాన్ని గమనించిన కె.ఎస్. రామారావు అతన్ని పట్టుకుని కొట్టడంతో అతడు నిజం చెప్పాడు. అతను నాకు పెద్ద అభిమాని అంట.. అతనితో కాకుండా కేరళకు చెందిన మరో వ్యక్తితో నేను మాట్లాడుతున్నానని తెలిసి, కేరళలో వశీకరణ పౌడర్ ను తెచ్చి కేకులో కలిపి నాకు తినిపించాడు. తనతో నేను మాట్లాడలేదని ఈ విధంగా చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇక అదంతా విని నేను అతనిని క్షమించి వదిలేశాను” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చిరు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.