Chiranjeevi : 60 ప్లస్ లోనూ ఆ ఎనర్జీ ఎలా? తన యవ్వన ‘సీక్రెట్’ బయటపెట్టిన చిరంజీవి!

Chiranjeevi Pottakooti Kosam

Chiranjeevi Pottakooti Kosam

ఆరు పదుల వయసు దాటినా కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని డ్యాన్సులు, ఫైట్స్ తో మెగాస్టార్ చిరంజీవి ఎలా అదరగొడుతున్నారో అని అంతా ఆశ్చర్యపోతుంటారు. అయితే తన ఎనర్జీకి, యవ్వనానికి అసలైన కారణం కేవలం ఎక్సర్‌సైజ్, డైట్ మాత్రమే కాదని ఆయన ‘మెగా యూత్ ఫోర్స్’ వేదికగా తొలిసారి ఓపెన్ అయ్యారు. తన తోటి వయసు వారు వృద్ధుల్లా కనిపిస్తుంటే, తానింకా యంగ్ గా కనిపించడానికి అసలైన కారణం “కృతజ్ఞత!” అంటూ తన ఇన్నర్ పీస్ గుట్టు విప్పారు. ఆ మధ్య ఎవరో అడిగారు, “ఏవండీ ఇంత యంగ్ గా ఇప్పటికీ ఉన్నారు? మీ వయసు వాళ్లే మా నాన్నగారు, మీ వయసు వాళ్లే మా బాబాయి వాళ్ళు.. చూస్తుంటే పెద్దోళ్లలా కనపడతారు. మీరేంటి ఇలా ఉన్నారు?” అని. అంటే, యా ఎందుకంటే నేను ఎక్సర్సైజ్ అవి రెగ్యులర్ గా చేస్తుంటాను, మంచి డైట్ తీసుకుంటాను. అది కూడా లిమిట్ గా తీసుకుంటూ ఉంటాను, అన్ని రకాలుగానూ కేర్ అంతా తీసుకుంటాను. ఆయా టైంకి డెఫిషియన్సీస్ లాంటివి ఏమన్నా ఉంటే గనుక, విటమిన్స్ కానివ్వండి అవన్నీ కూడా నేను కేర్ తీసుకుంటూ ఉంటాను అంటే.. అది సార్ కారణం అంటే అది కాదు కారణం అని చెప్పాను.

అసలైన కారణం.. కృతజ్ఞత! మనల్ని కన్న మన తల్లిదండ్రులు, మనకి చేదోడు వాదోడుగా మానసికంగా మన ముందు నడిపించిన మన దైవం, మన గురువులు, ఆయా సందర్భాల్లో మనకి మంచి హితబోధ చేసినటువంటి హితులు, సన్నిహితులు, ఫ్రెండ్స్, మన ఎదుగుదలకి మనల్ని ఇన్స్పైర్ చేసినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని కథలు ఏవైతే సమాజంలో ఉన్నాయో.. ప్రతిదీ మనకి ఏదైతే మన ఈరోజు ఈ అభివృద్ధికి, ఇంత పేరు ప్రఖ్యాతలు రావడానికి ఎవరైతే కారణ భూతులో వాళ్ళందరి పట్ల ‘కృతజ్ఞత’ అనేది ఈరోజున నాకు మానసిక ప్రశాంతతని, మానసిక సంతృప్తిని కలుగజేస్తుంది. ఆ రకమైన ఇన్నర్ పీస్.. అది మొఖం మీద సుస్పష్టంగా కనబడుతుంది. అదే ఎనర్జీ నాకు తీసుకొస్తుంది.

కాబట్టి, ఇప్పటికీ డాన్స్ చేయగలిగినా, ఇప్పటికీ ఫైట్స్ చేయగలిగినా, ఇప్పటికీ ఎనర్జిటిక్ గా ఉండగలనా? ఏంట్రా అని అనిపించేలాగా అంటే గనుక, అది మానసిక ప్రశాంతత, మానసిక శాంతి. మనలో నిరంతరం ఉండే కృతజ్ఞత నన్ను ఈ స్థితిలో ఇలా ఉంచింది. ఇది సత్యం. ఎందుకంటే, ఈరోజు ఈ యొక్క చిన్న గెట్ టుగెదర్ జరిగింది అంటే, ఇది కూడా థాంక్స్ గివింగ్. మీరు నా పిలుపుకి ఇన్స్పైర్ అయి, 1998 నుంచి ఈరోజు వరకు నిర్విరామంగా ఇది కొనసాగుతూ, ఒక అప్రతిహతంగా ఈ యొక్క బ్లడ్ క్యాంప్ కానివ్వండి, సేవా కార్యక్రమాలు కానివ్వండి, నేను ఏ పిలుపిస్తే అది ముందుకు తీసుకెళ్తూ, ఇది శిరోధార్యంగా ఉంటూ.. ఆ రోజున రాముడి మాట భరతుడు, లక్ష్మణుడు ఎలాగైతే విన్నారో, ఆ విధంగా నా తమ్ముళ్ళు మీరు ముందుకు తీసుకెళ్తూ, నా చెల్లెళ్లు, అక్కలు వీళ్ళందరూ కూడా ముందుకు అలా తీసుకువెళ్తూ ఉన్నారు కాబట్టి నేను ఇది నిర్విరామంగా చేయగలుగుతున్నానని చిరంజీవి అన్నారు.