Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఏ ముహూర్తాన గాడ్ ఫాదర్ సినిమాలో ఆ రాజకేయం డైలాగ్ చెప్పారో.. అప్పటి నుంచి సినిమా ఏమో కానీ చిరు పాలిటిక్స్ మీదనే అందరి దృష్టి పడింది. సినిమా డైలాగ్స్ ను పాలిటిక్స్ కు అన్వయించి నిజంగానే చిరు పాలిటిక్స్ లోకి వస్తున్నట్లు చెప్పుకొచ్చేస్తున్నారు. ఇక తాజాగా మీడియా తో ఇంటరాక్ట్ అయిన చిరు అన్ని ప్రశ్నలకు జవాబులు ఇచ్చేశారు. తాను సినిమాలు మాత్రమే చేస్తానని స్పష్టం చేశా. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఉంటానా..? ఉండనా..? అనేది కాలమే నిర్ణయిస్తోంది అనే చందాన చెప్పుకొచ్చారు. ఇక ఈ పాలిటిక్స్ లోకి మెగా కోడలు ఉపాసనను కూడా దింపేశారు. తెలంగాణలో మల్కాజిగిరి ఎంపీగా ఉపాసన పోటీ చేస్తుందని గత కొన్నిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ ప్రశ్నకు కూడా చిరు జవాబు ఇచ్చారు. “పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు మీరు ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.. మొన్నటికి మొన్న టిక్కెట్ల రేట్ల విషయంలో జగన్ గారిను కలిసినప్పుడు మీరు వైసీపీ లో జాయిన్ అయిపోయారు అంటూ వార్తలు వచ్చాయి. ఇక భీమవరంలో మోడీని కలిసినప్పుడు బీజేపీ లో జాయిన్ అవుతున్నారని చెప్పుకొచ్చారు.. ఇప్పుడు లేటెస్ట్ గా తెలంగాణలో కేటీఆర్, కేసీఆర్ ను కలిశారు.. చిరంజీవి వారసురాలిగా ఉపాసనను మల్కాజిగిరి ఎంపీగా దింపుతున్నారు అని అన్ని రకాలుగా రాస్తున్నారు.. మీరేమైనా మళ్లీ పాలిటిక్స్ వైపు వెళ్లే ఉద్దేశ్యం ఉందా..? మెగాస్టార్ గా మాతోనే ఉంటారా..? ” అని ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు చిరు మాట్లాడుతూ ” ఈ మాటలు అన్నవారు ఎవరో.. వారు గ్రేట్ క్రియేటర్స్. వాళ్ళు కనుక ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి నాకు కథలు అందించగలిగితే కనుక అద్భుతమైన కథలు వస్తాయి” అని నవ్వేశారు. అంటే ఇవన్నీ కథలే అని తేల్చి చెప్పేశారు. ప్రస్తుతం చిరు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.