NTV Telugu Site icon

Chiranjeevi: మేనల్లుడు హిట్.. మామయ్య దిల్ ఖుష్

Chiru

Chiru

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాను అయినా ఎంకరేజ్ చేయడంలో ఆయన తరువాతే ఎవరైనా.. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా సినిమా బావుంటే మాత్రం నిర్మొహమాటంగా ప్రశంసిస్తాడు. అలాంటింది.. తన తోబుట్టువు కొడుకు హిట్ కొడితే ప్రశంసించకుండా ఉండగలడా..?. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెల్సిందే. మేనల్లుడు హిట్ టాక్ అందుకోవడంతో మామయ్య తబ్బుబ్బి పోతున్నాడు. తేజ్ తో పాటు చిత్ర బృందాన్ని సైతం పొగడ్తలతో ముంచెత్తాడు. ” విరూపాక్షకు అద్భుతమైన స్పందన వస్తుందని విన్నాను. సాయి ధరమ్ తేజ్ నిన్ను చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. మంచి బ్యాంగ్ తో కమ్ బ్యాక్ ఇచ్చావ్. మీ సినిమాను ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదిస్తున్నందుకు ఆనందంగా ఉంది! మొత్తం టీమ్‌కి హృదయపూర్వక అభినందనలు” అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తేజ్ కు సురేఖ కేక్ తినిపిస్తున్న ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ కు మేనల్లుడు స్పందిస్తూ.. మామఅత్తకు థాంక్స్ చెప్పాడు.

Ugram Trailer: నరేష్ ఉగ్ర రూపం.. ఇదయ్యా నీ నట విశ్వరూపం

ఇక తేజ్ కు యాక్సిడెంట్ జరిగినప్పుడు అన్ని తానై నిలబడ్డారు మెగా కుటుంబం. ముఖ్యంగా చిరంజీవి, తన సోదరిని ఓదారుస్తూ దైర్యం చెప్పాడు. ఇక తేజ్ కోలుకున్నాకా కానీ, అంతకుముందు కానీ.. ఆయన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది చిరునే. ఇక తేజ్ సైతం తన మొదటి సినిమా నుంచి ఈ సినిమా వరకు తాను నిలబడింది వాళ్ళ మామయ్యల వలనే అని, వారు లేకపోతే ఈరోజు తాను లేనని చెప్తూనే వస్తున్నాడు. తేజ్ యాక్సిడెంట్ తరువాత రిపబ్లిక్ సినిమాను పైకి లేపింది తేజ్ మామయ్యలే.. అందుకే తనకు మామయ్యలంటే ఇష్టమని తేజ్ చెప్తూ ఉంటాడు. మరి ఈ మెగా మేనల్లుడు ఈ సినిమాతో ఎన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.

Show comments