రెండు రోజుల క్రితం కరోనా బారిన పడిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈరోజు చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు నేడు. అయితే చిరు ఈ ప్రత్యేకమైన రోజున ఆమెతో గడపడం లేదు. గత సంవత్సరం ఈ కుటుంబం హైదరాబాద్ లోని తమ ఇంట్లో చిన్న పార్టీ పెట్టి అంజనా దేవిని ఆశ్చర్యపరిచారు. అయితే దురదృష్టవశాత్తు చిరు వైరస్ బారిన పడడంతో ఈ రోజు ఆమెను కలవలేకపోయాడు. అయితే ఆయన తన తల్లి కోసం సోషల్ మీడియాలో రాసింది మాత్రం మనసు గెలుచుకుంది.
Read Also : కాస్ట్లీ బైకులపై మనసు పారేసుకుంటున్న బిగ్ బాస్ భామలు
ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ “అమ్మా ! జన్మదిన శుభాకాంక్షలు… క్వారంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా… నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ… అభినందనలతో …. శంకర బాబు” అని ట్వీట్ చేశాడు. ఈ మనోహరమైన శుభాకాంక్షలతో పాటు చిరు, అంజనా దేవి, భార్య సురేఖతో ఉన్న చిత్రాన్ని కూడా పంచుకున్నారు. ఇక చిరు, కొరటాల శివ ‘ఆచార్య’, ‘భోళా శంకర్’, ‘గాడ్ ఫాదర్’, ఇంకా పేరు పెట్టని కెఎస్ రవీంద్ర చిత్రంలో కనిపించనున్నారు.
