Site icon NTV Telugu

Mega 156: ఈ టైటిల్ చరణ్ నుంచి చిరుకి షిఫ్ట్ అయ్యిందే…

Chiru

Chiru

మెగాస్టార్ చిరంజీవి, యంగ్ డైరెక్టర్ వశిష్టతో కలిసి ఫాంటసీ సినిమా చేస్తున్నాడు. మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీ ఇప్పుడు మెగా 156గా మారింది. దసరా పండగ రోజున గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ మూడు లోకాల చుట్టూ తిరుగుతుందని సమాచారం. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసే మెగా 156 సినిమాకి ముల్లోక వీరుడు, ముల్లోకాల వీరుడు అనే టైటిల్స్ వినిపించాయి. ఇవి జస్ట్ రూమర్స్ గా మాత్రమే వినిపించాయి కానీ లేటెస్ట్ గా మెగా 156కి ఈ టైటిల్ ఫిక్స్ అయ్యింది అంటూ ఒక టైటిల్ మెగా ఫ్యాన్స్ లో సర్క్యులేట్ అవుతోంది. మెగా 156 యూనిట్ ఈ సినిమాకి ‘విశ్వంభర’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారని మెగా ఫ్యాన్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా కొంతమంది మెగా ఫ్యాన్స్ ఫ్యాన్స్ ‘విశ్వంభర’ ఫిక్స్ అయ్యిందని ట్వీట్స్ చేస్తున్నారు.

ముల్లోక వీరుడు టైటిల్ కన్నా విశ్వంభర టైటిల్ పవర్ ఫుల్ గా ఉంది కాబట్టి ఇది నిజమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ టైటిల్ మెగా ఫ్యాన్స్ లో వినిపించడం ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా విశ్వంభర టైటిల్ ని మెగా ఫ్యాన్స్ వైరల్ చేసారు. అప్పుడు రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాకి విశ్వంభర అనే టైటిల్ బాగా వినిపించింది. RC 15 అనే వర్కింగ్ టైటిల్ వినిపించిన సమయంలో… విశ్వంభర ఫైనల్ అయ్యింది అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేసారు. ఇప్పుడు చరణ్ నుంచి విశ్వంభర టైటిల్ చిరుకి షిఫ్ట్ అయ్యింది. మరి దీన్నే లాక్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారా లేక ఇంకో టైటిల్ ని ప్రిఫర్ చేస్తారా అనేది చూడాలి.

Exit mobile version