Chiranjeevi- Nagarjuna : మెగాస్టార్ చిరంజీవి-నాగార్జున కాంబోలో మల్టీస్టారర్ కోసం ఎప్పటి నుంచో ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నాగార్జున, చిరు ఎంతో క్లోజ్ గా ఉంటారు. నిత్యం కలుసుకుంటూనే ఉంటారు. ప్రతి విషయంలో ఒకరికి ఒకరు అండగా ఉంటారు. ఒకరి ఇంట్లో ఫంక్షన్లకు ఇంకొకరు వచ్చి సందడి చేస్తుంటారు. అలాంటి వీరిద్దరూ ఎందుకు మల్టీస్టారర్ చేయలేదు అనే డౌట్ అందరికీ ఉండే ఉంటుంది. ఓ సారి వీరిద్దరి కాంబోలో మల్టీ స్టారర్ ప్లాన్ చేశారు. ఆయన ఎవరో కాదు దివంగత డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ.
Read Also : Manchu Vishnu : అమితాబ్ బచ్చన్ ను డైరెక్ట్ చేస్తా.. విష్ణు కామెంట్స్..
అప్పటికి వీరిద్దరు మంచి స్టార్ డమ్ తో దూసుకుపోతున్నారు. ఆ టైమ్ లో వీరి స్టార్ డమ్ ను దృష్టిలో పెట్టుకుని భారీ బడ్జెట్ తో మూవీని ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్టు కథను కూడా అనుకున్నారు. కానీ కథ వారిని మెప్పించకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు. దాంతో ఆ మూవీ అక్కడే ఆగిపోయింది. ఆ తర్వాత ఈవీవీ మరో ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆ తర్వాత మల్టీస్టారర్ లు రావడం ఆగిపోయింది. అందుకే వీరి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఆ ధైర్యం చేయలేదు.
Read Also : Thaman : అడ్రస్ పెట్టురా వచ్చి నేర్చుకుంటా.. థమన్ ఫైర్..!
