Site icon NTV Telugu

Chiranjeevi: “గుండె ఎడమ వైపు కాదు.. కుడి వైపు! ‘చిరంజీవి’ మూవీ షాకింగ్ కాన్సెప్ట్!

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు విభిన్నమైన కథలతో వచ్చి భారీ విజయాలు సాధిస్తున్నాయి. ఈ క్టారమంలోనే లీవుడ్ నుంచి మరో వైవిధ్యమైన కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా రాబోతోంది. సాధారణంగా మనిషికి గుండె ఎడమ వైపు ఉంటుంది, కానీ ఒకవేళ గుండె కుడి వైపు ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆసక్తికరమైన పాయింట్‌తో తెరకెక్కుతున్న సినిమా “చిరంజీవి”. కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.

Also Read :Om Shanti Disco Shanti: దెయ్యాలకే చుక్కలు చూపించే పిచ్చోళ్లు!

ఈ కార్యక్రమంలో చిత్ర బృందం సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘డెక్స్ట్రోకార్డియా’ (Dextrocardia) అనే అరుదైన ఆరోగ్య స్థితిని (గుండె కుడి వైపు ఉండటం) కమర్షియల్ ఎలిమెంట్స్‌తో జోడించి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. తనికెళ్ల భరణి, ఈశ్వరీ రావు, గోపరాజు రమణ వంటి సీనియర్ నటులతో పాటు వైవా రాఘవ, శ్రీకాంత్ భరత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరి ఉనికి సినిమాకు మంచి వెయిట్‌ను తీసుకొస్తుందని దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని కికు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సినిమాను ఈ వేసవిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్లింప్స్ చూస్తుంటే మేకింగ్ వాల్యూస్ బాగున్నాయని, దీప్తి నడిమింటి రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారని అర్థమవుతోంది. కొత్త దర్శకుడైనప్పటికీ, శుభ సాయి వెంకట్ ఈ పాయింట్‌ను హ్యాండిల్ చేసిన తీరు బాగుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. తెలుగు మేకర్స్ చేస్తున్న ఇటువంటి ప్రయోగాలు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి. సినిమా టైటిల్ “చిరంజీవి” కావడం, అందులోనూ ఈ విభిన్నమైన కాన్సెప్ట్ ఉండటంతో సోషల్ మీడియాలో ఇప్పటికే దీనిపై చర్చ మొదలైంది.

Exit mobile version