Site icon NTV Telugu

Chiranjeevi: బాసూ, అదిరింది నీ గ్రేసు.. ఎలా ఇలా?

Chiranjeevi's New Look From Vishwambhara

Chiranjeevi's New Look From Vishwambhara

Chiranjeevi Looks From Vishwambhara Goes Viral : మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. పొలిటికల్ ఎగ్జిట్ ఇచ్చి సినీ రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఎంచుకుంటున్న సినిమాలతో పాటు ఆయా సినిమాల కోసం ఆయన మేకోవర్ అవుతున్న తీరు చర్చనీయాంశం అవుతుంది. ప్రస్తుతానికి ఆయన వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతానికి హైదరాబాద్ కి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచంపల్లి అనే ప్రాంతంలో జరుగుతుంది. అక్కడికి మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ మరో సోదరుడు నాగబాబు వెళ్లి రావడంతో కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇక ఆ ఫోటోలలో చాలామంది ముగ్గురి బాండింగ్ భలే ఉంది అంటూ మెచ్చుకుంటున్నారు కానీ మెగాస్టార్ చిరంజీవి లుక్ కూడా అంతే వైరల్ అవుతుంది. కుర్ర హీరోలు అందరికీ పోటీ ఇచ్చేలా వరుస సినిమాలు లైన్లో పెట్టడం మాత్రమే కాదు ఆయన మీకోవర్ కూడా ఒక రేంజ్ లో కనిపిస్తోంది.

Jr NTR Fans: అభిమానమా, లేక పైత్యమా? ఇదేం పని?

తాజాగా బయటకు వచ్చిన ఫొటోస్ కనుక గమనిస్తే చిరంజీవి చాలా ఫిట్ గా కనిపిస్తున్నారు. అంతేకాకుండా చాలా యంగ్ లుక్ లో చిరంజీవి గ్రేస్ అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తుంది. నిజానికి ఈ లుక్ ఈ మధ్య కాలంలో ఆయన అభిమానులు అందరూ అచ్చెరువొందేలా, ఇది బెస్ట్ లుక్ అనుకునేలా ఉందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మెరూన్ కలర్ షర్ట్ లో పూర్తిగా రఫ్ గా కాకండా అలా అని పూర్తిగా లేకుండా ఉండకుండా గడ్డం మైంటైన్ చేసిన తీరుకు గాగుల్స్ తో చిరంజీవి కనిపిస్తూ చిరునవ్వులు చిందిస్తున్న లుక్ చూసి అభిమానులు మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులు సైతం అబ్బా ఏమున్నాడ్రా? చిరంజీవి అనుకునేలా మెస్మరైజ్ చేసేలా ఉంది లుక్. మొత్తం మీద చిరంజీవి ఈ వయసులో కూడా కనిపిస్తున్న తీరుకి ఫిదా అవ్వని వారెవరు? చెప్పండి. ఇక విశ్వంభర సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రానుంది. ఇక ఈ లుక్స్ బయటకు రావడంతో వచ్చే సంక్రాంతికి మాకు ఫుల్ మీల్స్ గ్యారెంటీ అని ఫాన్స్ ఫిక్స్ అయిపోయారు.

Exit mobile version