NTV Telugu Site icon

Chiranjeevi: చిరు లీక్స్.. కీర్తి సంగీత్ లో.. మెగాస్టార్ స్టెప్పులు

Chiru

Chiru

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా నటిస్తుండగా.. చిరు చెల్లిగా కీర్తి సురేష్ నటిస్తోంది. తమిళ్ లో భారీ విజయాన్ని అందుకున్న వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఎప్పటికప్పుడు ఈ చిత్ర విశేషాలను చిరు.. చిరు లీక్స్ ద్వారా లీక్ చేస్తున్న విషయం తెల్సిందే. యూనిట్ కు తెలియకుండా సెట్ లోని ఫొటోస్ ను లొకేషన్స్ ను షేర్ చేస్తూ అభిమానులకు ఉత్సాహం తెప్పిస్తూ ఉంటాడు. ఇక తాజాగా చిరు.. ఇంకో చిరు లీక్ ను అభిమానులతో పంచుకున్నాడు. నేడు సెట్ లో ఒక సాంగ్ షూటింగ్ జరుగుతున్నట్లు తెలిపాడు. అది ఒక సంగీత్ సాంగ్ అని.. అందులో సినిమాలో నటించినవారందరు ఉన్నారని తెలిపాడు. అంతేనా.. ఆ మేకింగ్ వీడియోను ఎవరికి తెలియకుండా.. తన ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తున్నాను అని, ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా ఉంచి.. మీరొక్కరే చూడాలని చెప్పుకొచ్చాడు.

Rangabali Teaser: వాడు ఎంత వెధవో వర్ణించాలంటే దేవుడు వరం ఇవ్వాలి

ఇక తాజాగా చిరు లీక్స్ వీడియో వచ్చేసింది. ఈ వీడియోలో సంగీత్ సాంగ్ షూట్ జరుగుతుంది. సినిమా లో నటించిన.. కీతి సురేష్, తమన్నా, సుశాంత్, వెన్నెల కిషోర్, హైపర్ ఆది, రఘుబాబు.. తదితరులు అందరు ఆ సెట్ లో కనిపించారు. చిరుకు చెల్లిగా నటించిన కీర్తి పెళ్లి సంగీత్ లా కనిపిస్తుంది. ఇందులో ప్రతి ఒక్కరు చిందేసి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో అందరు ఎంతో కళకళలాడిపోతున్నారు. ముఖ్యంగా చిరు.. ఆయన గ్రేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Show comments