Site icon NTV Telugu

దెయ్యంలా మారి భయపెడుతున్న చిరు

Chiranjeevi

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి దెయ్యంలా మారి భయపెడుతున్నారు. అయితే అది ఏదో సినిమా కోసం కాదు.. రియల్ గానే చిరు దెయ్యంలా మారిపోయిన పిక్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. విషయానికొస్తే… నిన్న హాలోవీన్ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో హాలోవీన్ సందర్భంగా తన సరదా వీడియోను పంచుకున్నారు.

Read Also : బాలయ్య “అన్‌స్టాపబుల్‌”లో ఎన్టీఆర్, ప్రభాస్

చిరు తన అభిమానులకు ‘హ్యాపీ హాలోవీన్’ అంటూ శుభాకాంక్షలు తెలపడమే కాకుండా చిన్న వీడియోను విడుదల చేశారు. వీడియోలో చిరు హాలోవీన్ మేక్ఓవర్ పొందడానికి యాప్‌ని ఉపయోగిస్తున్నట్లు చూపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేస్తూ, “ఉత్కంఠభరితమైన రోజు” అని క్యాప్షన్ ఇచ్చాడు మెగాస్టార్. ఈ వీడియో మెగా అభిమానులను అమితంగా ఆకర్షిస్తోంది.

ఇక చిరు సినిమాల విషయానికొస్తే… వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న చిరు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన “ఆచార్య” చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ప్రస్తుతం ఆయన చేతిలో ‘గాడ్‌ఫాదర్’, ‘భోళా శంకర్’ వంటి వరుస సినిమాలు ఉన్నాయి.

Exit mobile version