NTV Telugu Site icon

Mega Little Princes : బారసాల కు వచ్చిన ప్రతి ఒక్కరికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన చిరంజీవి..?

Whatsapp Image 2023 07 01 At 9.52.40 Am

Whatsapp Image 2023 07 01 At 9.52.40 Am

మెగా కుటుంబంలోకి లిటిల్ ప్రిన్సెస్ రావడంతో చిరంజీవి కుటుంబంలో పండగ వాతావరణం ఏర్పడింది.ఇక మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబంలోకి మహాలక్ష్మి అడుగు పెట్టిందంటూ ఎంతగానో మురిసిపోయారు.అభిమానులు కూడా ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే శుక్రవారం మెగా ఇంట ప్రిన్సెస్ నామకరణ దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది . ఇదిలా ఉండగా చిరంజీవి తన మనవరాలు పేరును ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.దాదాపు 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ ఉపాసనలు తల్లిదండ్రులు అయ్యారు. దీనితో మెగా కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది. జూన్ 20న ఈ దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మనిచ్చింది. ఇక ఆడబిడ్డ పుట్టడంపై మహాలక్ష్మి పుట్టిందంటూ కుటుంబంతో సహా చిరంజీవి కూడా ఎంతగానో ఆనందపడ్డారు.ఇక ఉపాసన డిశ్చార్జ్ సమయంలో కూడా రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ ఎంతో ఆనందం వ్యక్తం చేసారు.

ఆ సమయంలో బిడ్డకు ఏం పేరు పెట్టబోతున్నారు అని రాంచరణ్ ను ఓ రిపోర్టర్ ప్రశ్న అడగ్గా.. సాంప్రదాయం ప్రకారం బారసాల రోజు వెల్లడిస్తామంటూ ఆయన సమాధానమిచ్చాడు. అయితే ఓ పేరు అనుకుంటున్నట్లు.. అదే పేరును ఫిక్స్ అయినట్లు కూడా తెలిపాడు. ఇక బిడ్డ ఎవరి పోలిక అని అడగ్గా ఇంకెవరి పోలిక నాన్న పోలిక అంటూ సమాధానం ఇచ్చాడు రాంచరణ్. లిటిల్ ప్రిన్సెస్ బారసాల వేడుకకు చిరంజీవి నివాసంలో ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేసి అలంకరణ చేశారు. ఈ వేడుకకు ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.బారసాల ఫంక్షన్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి మెగాస్టార్ చిరంజీవి పట్టుచీర గాజులతో పాటు గోల్డ్ కాయిన్ గిఫ్ట్ గా ఇచ్చారని సినీ వర్గాల సమాచారం..ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.. తన మనుమరాలు పేరును చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఆ బేబీ పేరును క్లీన్ కారా కొణిదలగా ప్రకటించారు.. లలిత సహస్రనామం నుంచి ఈ పేరు తీసుకున్నట్లు చిరంజీవి చెప్పుకొచ్చారు.. ఈ పేరు ఆధ్యాత్మిక మేల్కొలుపును తీసుకువచ్చే శక్తిని, ప్రకృతి స్వరూపాన్ని కూడా సూచిస్తుంది. ఈ లక్షణాలను మా లిటిల్ ప్రిన్సెస్ అందిపుచ్చుకొని తన వ్యక్తిత్వంలో పెరిగే కొద్దీ ఇమడ్చుకుంటుందని మేము కచ్చితంగా నమ్ముతున్నాము.. అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.

Show comments